Advertisement
తెలుగు న్యూస్

ఆర్య చీటర్ కాదన్న పోలీసులు


తమిళ హీరో ఆర్య మోసగాడు కాదని తేల్చారు తమిళనాడు పోలీసులు. ఆర్య తనని మోసం చేసాడని జర్మనీలో స్థిరపడ్డ ఒక తమిళ యువతి కొన్నాళ్ల క్రితం కేసు వేసింది. తనతో రోజూ సెక్స్ చాట్ చేసేవాడు అని ఆమె చెప్పింది. కొన్నాళ్ల తర్వాత తన నుంచి 90 లక్షలు లాగాడని ఆమె ఆరోపించింది.

ఆరోపణలకు రుజువుగా ఆమె తన సెల్ ఫోన్ రికార్డులు చూపించింది. చెన్నై సైబర్ క్రైం పోలీసులు సుదీర్ఘ విచారణ అనంతరం ఆర్యకు క్లీన్ చీట్ ఇచ్చారు.ఈ కేసులో ఆర్య తప్పేమి లేదని పోలీసుల విచారణలో తేలింది.

ఆర్య పేరుని, ఫోటోని వాడుకొని ఆ అమ్మాయిని ఇద్దరు యువకులు మోసం చేసారని తేల్చారు పోలీసులు. మొహమ్మద్ అర్మాన్, మొహమ్మద్ హుస్సేనీ అనే ఇద్దరు ఆన్లైన్ కేటుగాళ్లు ఆమెని బుట్టలో వేసుకున్నారు. తనతో చాట్ చేస్తున్నది ఆర్య అని భావించిన ఆ అమ్మాయి 90 లక్షల రూపాయల డబ్బులు కూడా ఆన్ లైన్ పంపించింది. ఆ తర్వాత వాళ్ళు ఆమెతో మాట్లాడడం మానేశారు. అప్పుడు ఆమె మోసపోయానని గ్రహించిందట.

ఈ కేసులో తనకి ఊరట లభించడంతో ఆర్య చెన్నై పోలీసులకు కృతజ్ఞతలు తెలిపాడు. ఇన్నాళ్లు చాలా ఒత్తిడికి గురైనట్లు చెప్పాడు ఈ హీరో. ఆర్య భార్య సాయేషా ఇటీవలే ఓ బిడ్డకు జన్మనిచ్చింది. హీరోగా కూడా “సార్పట్ట పరంపర” అనే సినిమాతో విజయం అందుకున్నాడు.

Advertisement

This post was last modified on August 25, 2021 6:48 pm

Advertisement
Share