Advertisement
తెలుగు న్యూస్

ఇక అన్ని భారీ చిత్రాలే!


నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ’ సినిమా 50 రోజులు ఆడింది. ఈ మధ్య కాలంలో ఏ సినిమా కూడా 50 రోజులు థియేటర్లలో ఆడలేదు. ‘పుష్ప’లాంటి సినిమా కూడా మూడు వారాలకే ఓటిటిలోకి వచ్చింది. బాలయ్య సినిమా అనేక సెంటర్లలో 50 రోజులు ఆడడం పెద్ద విశేషం. అంతే కాదు, ఈ సినిమా బాలయ్య కెరియర్ లోనే అత్యధిక వసూళ్లు అందుకున్న చిత్రంగా నిలిచింది.

బాలయ్య సినిమాలు బాగా ఆడితే థియేటర్ల నుంచి 60 కోట్లు, మరో 25 కోట్లు డిజిటల్, శాటిలైట్, హిందీ డబ్బింగ్ రైట్స్ ద్వారా రాబట్టుకోవచ్చు అని ప్రూవ్ చేసింది ‘అఖండ’. ఐతే, నోట్ దిస్ పాయింట్ యువరానర్ “సినిమా బాగా ఆడితే”.

ఓవరాల్ గా బాలయ్య సినిమాల మార్కెట్ రేంజ్ పెరిగింది. సో… ఇకపై బాలయ్య చిత్రాలు అన్ని భారీగానే ఉండనున్నాయి. ‘అఖండ’ సినిమాకి దాదాపు 70 కోట్లు ఖర్చు అయింది. సో, ఇకపై మిగతా సినిమాలు కూడా అటుఇటుగా ఇంతే ఖర్చుతో భారీగా తీసారట.

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందే కొత్త సినిమాకి కూడా 60 కోట్ల వరకు ఖర్చు పెట్టనుంది మైత్రి మూవీ మేకర్స్ సంస్థ. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్. మెయిన్ విలన్ గా కన్నడ నటుడు దునియా విజయ్ నటిస్తున్నారు. థమన్ సంగీతం ఇవ్వనున్నారు. కెమెరామెన్, ఇతర నటులు అందరూ పేరొందిన వారే.

Advertisement

This post was last modified on January 20, 2022 7:21 pm

Advertisement
Share