Advertisement
తెలుగు న్యూస్

రాజమౌళికి బండి సంజయ్ ప్రశ్న

“అర్.ఆర్.ఆర్” సినిమా టీజర్లో కొమరం భీమ్ పాత్ర ముస్లిం టోపీ ధరించడంపై జరుగుతున్న రగడని తెలంగాణ బీజేపీ మరింతగా ఎగవేస్తోంది. గత వరం రోజులుగా బీజేపీకి చెందిన నాయకులు ఈ టీజర్ గురించి బహిరంగంగా కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా రాష్ట్ర అధ్యకుడు బండి సంజయ్ ట్వీట్స్ కూడా వేశారు. రాజమౌళికి సూటిగా ప్రశ్నలు గుప్పించారు.

“హిందువులైన ఆదివాసుల ఆత్మగౌరవం కొమురం భీంకు రాజమౌళి గారి సినిమాలో టోపీ పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఇది ఆదివాసుల మనోభావాలను దెబ్బతీసేలా ఉంది. ఆదివాసుల దైవం కొమురం భీంకు టోపీ పెట్టేవారికి నిజాం ఫొటోకు కానీ, ఒవైసీకి గాని బొట్టు పెట్టి కాషాయ కండువా వేసే దమ్ముందా?,” అంటూ బండి సంజయ్ తన ట్వీట్లో క్వశ్చన్ చేశారు.

ఐతే ఈ సినిమాకి గాని, ఇందులో నటిస్తున్న ఎన్టీఆర్ కి, రామ్ చరణ్ కి తాము వ్యతిరేకం కాదని క్లారిటీ ఇచ్చారు బండి సంజయ్. ఆ సీన్లపైనే తమ అభ్యంతరం అంటున్నారు. “ఈ సినిమాలో నటించే జూ.ఎన్టీఆర్ గారికి గాని,రామ్ చరణ్ గారికి గాని ఇతర నటీనటులకు మేము వ్యతిరేకం కాదు.వారిని గౌరవిస్తాం.అది మా సంస్కారం.హిందువుల మనోభావాలతో చెలగాటం ఆడితే మాత్రం దాన్ని సహించం.ఈ మధ్య హిందువుల మనోభావాలతో ఆడుకోవడం ఒక ఫ్యాషన్ గా మారింది. దాన్ని అందరం కలిసి అడ్డుకోవాల్సిందే,” అని ట్వీటారు.

Advertisement

This post was last modified on November 1, 2020 1:21 pm

Advertisement
Share