Advertisement
తెలుగు న్యూస్

చిరుతోనే బీజేపీ సోషల్ ఇంజనీరింగ్!

బీజేపీ ఆంధ్రప్రదేశ్ కొత్త అధ్యక్షుడు సోము వీర్రాజు మెగాస్టార్ చిరంజీవిని కలవడం వెనుక ఉన్న కోణం ఏంటి? ఇది కేవలం మర్యాదపూర్వక కలయిక అనుకోవడానికి వీలు లేదు. ప్రస్తుతం అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు అంటూ హాయిగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న చిరంజీవితో మర్యాద పూర్వక కలయికలు ఎందుకు? ఎదో ప్రయోజనం ఆశించకుండా రాజకీయనాయకులు చేస్తారా? మరి ముఖ్యంగా బీజేపీ …. దేంట్లో అయినా రాజకీయ లభ్దికి ప్రయత్నిస్తుంది అని సుశాంత్ సింగ్ మరణం కేసులో చేస్తున్న విన్యాసాలే బెస్ట్ ఎగ్జామ్పులు. కాబట్టి దీని వెనుక కూడా స్కెచ్ ఉందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

బీజేపీ ఏపీలో సోషల్ ఇంజనీరింగ్ మొదలెడుతోంది. ఆంధ్ర రాజకీయాల్లో కులం కీలకం. కాపులు సంఖ్య పరంగా ఎక్కువ కానీ ఆ ఓటర్లని రాజకీయంగా మలుచుకోవడంలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ …ఇద్దరూ అట్టర్ ప్లాప్ అయ్యారు. కానీ బీజేపీ ఇలాంటి వాటిల్లో ఆరితేరింది. ఇతర రాష్ట్రాల్లో సక్సెస్ ఫుల్ గా చేసి చూపింది. అందుకే పవన్ కళ్యాణ్ పార్టీకి ఒక్క సీట్ మాత్రమే వచ్చినా… పొత్తు పెట్టుకొంది. మెగాస్టార్ ని కలిసి …. కాపులకు ఒక సందేశాన్ని పంపింది.

కాపు నాయకుడు కన్నా లక్ష్మినారాయణని అధ్యక్షుడిగా తొలగించినా.. తాము కాపులకి కాపు కాసేలా వ్యూహాలు రాస్తోంది. అవసరం ఐతే 2024లో చిరంజీవిని బరిలోకి దించొచ్చు అని టాక్. అప్పటివరకు ఆయన్ని సినిమాలు చేసుకోమంటుంది.

Advertisement

This post was last modified on August 7, 2020 5:28 am

Advertisement
Share