Advertisement
తెలుగు న్యూస్

అందరికీ ప్రైవేట్ చార్టెర్డ్ విమానాలే!

నిహారిక డెస్టినేషన్ వెడ్డింగ్ ఖర్చు ఏంతో కానీ… మొత్తం మెగా ఫామిలీలోని హీరోలు, వారి కుటుంబ సభ్యులు, బంధువులు… అందరూ ప్రైవేట్ ఛార్టర్డ్ ఫ్లైట్ లో వెళ్లడం ఒక హాట్ టాపిక్ గా మారింది. ఎవరి కారులో వాళ్ళు పెళ్ళికి వెళ్లినట్లుగా ఒక్కో ఫామిలీ ఒక్కో విమానం వేసుకొని ఉదయ్ పుర్ వెళ్లడంతో సామాన్యులు నోరు వెళ్లబెడుతున్నారు. మెగా ఫ్యామిలీ పిచ్చ రిచ్ అన్న విషయం అందరికి తెలుసు. ఇప్పుడు నిహారిక వెడ్డింగ్ తో వాళ్ళ రిచ్ లైఫ్ స్టైల్ అర్థం అయింది.

గతంలో సమంత, చైతన్య పెళ్లి కూడా ఇలాగే గ్రాండ్ గా జరిగింది. గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్. ఐతే, అప్పుడు చార్టర్డ్ ఫ్లైట్ ల సందడి మెగా ఫ్యామిలీతో పోల్చితే కొంత తక్కువే.

మొత్తమ్మీద, నిహారిక పెళ్లి హంగామా… ఇప్పుడు నేషనల్ లెవెల్ లో ట్రేండింగ్ టాఫిక్ అయింది. ఆమె హీరోయిన్ గా ఒక్క హిట్ కొట్టలేదు కానీ ఇప్పుడు పెళ్లి హంగామాతో జాతీయ స్థాయిలో ఫోకస్ లోకి వచ్చింది.

Advertisement

This post was last modified on December 8, 2020 9:55 pm

Advertisement
Share