Advertisement
తెలుగు న్యూస్

ఎన్టీఆర్ కి భారతరత్న ఇవ్వాలి: చిరంజీవి

నేడు స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి. తెలుగుసినిమా, తెలుగు రాజకీయాల గతి మార్చిన శక్తి… ఎన్టీఆర్. ఆయన 98వ జయంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ప్రభుత్వాలకి ఒక విన్నపం చేశారు. ఎన్టీ రామారావు శత జయంతి సందర్భంగానైనా భారతరత్న వచ్చేలా చూడాలని చిరంజీవి కోరారు.

“మన తెలుగుతేజం, దేశం గర్వించే నాయకుడు నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇస్తే అది తెలుగువారందరికీ గర్వకారణం,” అని చిరంజీవి కోరారు.

‘తిరుగులేని మనిషి’ వంటి సినిమాల్లో ఎన్టీఆర్ తో కలిసి నటించారు చిరంజీవి. మెగాస్టార్ ప్రతి హీరో, ప్రతి నటుడు బర్త్ డేలకు తనదైన శైలిలో బర్త్ డే విషెస్ పోస్ట్ చేస్తారు సోషల్ మీడియాలో.

Advertisement

This post was last modified on May 28, 2021 10:14 am

Advertisement
Share