Advertisement
తెలుగు న్యూస్

చిరంజీవి బర్త్ డేకి బోలెడు అప్డేట్లు


ఆగస్టు 22… మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు. ఒకప్పుడు చిరంజీవి బర్త్ డే అంటే ఒక పండగలా ఉండేది. కాలం మారింది, తరం మారింది. మునుపటి కోలాహలం లేకున్నా… ఆయన సినిమాల దూకుడు తగ్గలేదు. ఇప్పుడు మరిన్ని సినిమాలు చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. దానికి తగ్గట్లే అప్డేట్ ల హంగామా కూడా పెరిగింది.

ఈసారి పుట్టినరోజుకు నాలుగు సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ రానున్నాయి.

ఆచార్య నుంచి ఒక కొత్త పోస్టర్. కుదిరితే రిలీజ్ డేట్ కూడా ఈ పోస్టర్ లో చెప్పే అవకాశం ఉంది. “ఆర్ ఆర్ ఆర్” విషయంలో రాజమౌళి క్లారిటీ ఇస్తే ‘ఆచార్య’ సినిమా పోస్టర్ లో రిలీజ్ డేట్ ఉంటుంది. రాజమౌళి ఉక్రెయిన్ నుంచి ఇండియాకి వచ్చారు.

గాడ్ ఫాదర్: మలయాళంలో సూపర్ హిట్టైన ‘లూసిఫర్’ రీమేక్ చిత్రానికి ‘గాడ్ ఫాదర్’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ లో కనిపిస్తారు. నయనతార, సత్యదేవ్ వంటి ఇతర తారాగణం ఉంది. ఈ సినిమా అప్డేట్ కూడా ఆ రోజు ఉంటుంది.

మెహెర్ రమేష్ మూవీ: తమిళంలో హిట్టైన ‘వేదాళం’ అనే సినిమా రీమేక్ లో కూడా చిరంజీవి నటించనున్నారు. ఈ సినిమాకి మెహెర్ రమేష్ డైరెక్టర్. కీర్తి సురేష్ చిరంజీవికి చెల్లెలుగా నటించనుంది. ఈ మూవీ నుంచి ఒక అప్డేట్.

బాబీ – మైత్రి మూవీ మేకర్స్: డైరెక్టర్ బాబీ చెప్పిన కథకి చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనుంది. కేవలం ఒక పోస్టర్ వస్తుంది.

Advertisement

This post was last modified on August 17, 2021 10:18 pm

Advertisement
Share