Advertisement
తెలుగు న్యూస్

ఇది నా డ్రీమ్ మూవీ: మేఘా ఆకాష్

ఇటీవలే ‘రాజ రాజ చోర’ సినిమాలో మంచి పాత్ర పోషించి ప్రశంసలు అందుకొంది బ్యూటీ …మేఘా ఆకాష్. ఇప్పుడు స్లిమ్ గా కూడా తయారైంది. ఈ అందాల భామ నటించిన కొత్త చిత్రం… ”డియర్ మేఘ”. సెప్టెంబర్ 3న రిలీజ్ కాబోతున్న ఈ మూవీ గురించి మేఘా ఆకాష్ తన అభిప్రాయాలను మీడియాతో పంచుకున్నారు.

“రాజ రాజ చోర” తర్వాత ”డియర్ మేఘ” రిలీజ్ కావడం ప్లస్ పాయింట్ అనుకుంటున్నా. దానికి మంచి పేరు వచ్చింది. ఇది ఇంకా ఎక్కువ నేమ్ తెస్తుందని భావిస్తున్నా. దర్శకుడు సుశాంత్ రెడ్డి ఫీమేల్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ ఉంది అని చెప్పినప్పుడు భయమేసింది. కానీ కథ మొత్తం విన్న తర్వాత ధైర్యం వచ్చింది. కొత్త కథలు చెయ్యాలంటే కొంచెం ధైర్యం చెయ్యాలి. అందుకే చేశాను. ఇది డ్రీం మూవీ. నాకు బాగా నచ్చింది.

అన్ కండిషనల్ లవ్ అంటే ఎలా ఉంటుందో చూస్తారు ఇందులో. ఈ సినిమాలో చూపించిన జెన్యూన్ లవ్ ను ప్రేక్షకులు ఫీల్ అవుతారు. ప్రతి ఒక్కరూ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ప్రేమలో పడుతారు. నా లైఫ్ లోనూ జరిగింది. అయితే డియర్ మేఘ చిత్రంలో జరిగినట్లు నా జీవితంలో జరిగిందా అనేది చెప్పలేను. ఇదొక ట్రయాంగిల్ లవ్ స్టోరి అనుకోవచ్చు.

డియర్ మేఘ క్యారెక్టర్ కు నాకు వ్యక్తిగతంగా కొన్ని పోలికలు ఉన్నాయి. డియర్ మేఘ లోపల చాలా అల్లరి పిల్ల కానీ బయటకు కామ్ గా ఉంటుంది. నేనూ అంతే పర్సనల్ గా చాలా యాక్టివ్ గా ఉంటాను కానీ అందరి మధ్య ఉన్నప్పుడు కామ్ అయిపోతాను.

ఇక పర్సనల్ లవ్ మేటర్ కి వస్తే… నేను ఖచ్చితంగా లవ్ మ్యారేజ్ చేసుకుంటాను.

ఫస్ట్ క్రష్ నాలుగో తరగతిలోనే జరిగింది. అప్పుడు నా పక్కన కూర్చునే అబ్బాయితో ఫస్ట్ క్రష్ ఏర్పడింది. అది ప్రేమ కాదు. ఆ తర్వాత షారుక్ ఖాన్ అంటే ఇష్టం ఏర్పడింది. నాకు కాబోయే జీవిత భాగస్వామి మంచోడు అయి ఉండాలి. నన్ను నాలా ఉండనివ్వాలి.

కెరీర్ గురించి ఎన్నో ప్లాన్స్ వేసుకొని ఇండస్ట్రీకి వచ్చాను. కానీ ఇక్కడ ఏదీ మనం అనుకున్నట్లు జరగదు. ఇప్పుడు నా ఆలోచనా విధానం మారిపోయింది. నా కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి సినిమాలు ఎంచుకుంటున్నాను. ఇకపైనా అలాగే కంటిన్యూ చేస్తాను.

ప్రస్తుతం “గుర్తుందా శీతాకాలం” సినిమాలో నటిస్తున్నాను. మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.

Advertisement

This post was last modified on August 28, 2021 6:01 pm

Advertisement
Share