Advertisement
తెలుగు న్యూస్

దీపికకి పోటీగా మరో భామ లేదు

ఇండియాలో నెంబర్ వన్ హీరోయిన్ ఎవరు? ఎటువంటి సంకోచం లేకుండా దీపిక పదుకోన్ పేరు చెప్పొచ్చు. ఎందుకంటే ఆమె పారితోషికం మామూలుగా లేదు. ఆమెకి దరిదాపులో మరో భామ లేదు.

దీపిక పదుకోన్ అక్షరాలా సినిమాకి 20 కోట్ల రూపాయలు తీసుకుంటున్నట్లు సమాచారం. ప్రభాస్ సరసన ‘ప్రాజెక్ట్ కే’లో నటించినందుకు ఆమె 18 కోట్లు తీసుకొంది. ఇక తాజాగా షారుక్ ఖాన్ కొత్త సినిమాలో నటించేందుకు ఆమె 20 కోట్లు డిమాండ్ చేసిందట. దానికి నిర్మాతలు ఒప్పుకున్నారు.

అంటే దీపిక పదుకొనె పారితోషికం పెద్ద హీరోలకు సమానంగా ఉన్నట్లే.

ఆమె తర్వాతి స్థానం అలియా భట్. అలియా భట్ 6 కోట్ల రేంజ్ లో తీసుకుంటుంది. అంటే దీపిక తీసుకునే మొత్తానికి, రెండో ప్లేస్ హీరోయిన్ కి మధ్య దాదాపు 14 కోట్ల వ్యత్యాసం.

Advertisement

This post was last modified on May 8, 2023 4:37 pm

Advertisement
Share