దీపిక పదుకోన్ ఇండియాలో నంబర్ వన్ హీరోయిన్. పారితోషికం పరంగా ఆమెకి దరిదాపుల్లో మరో హీరోయిన్ లేదు. ఇక రామ్ చరణ్ కి “ఆర్ ఆర్ ఆర్”తో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు వచ్చింది. వీరిద్దరి కలయికలో సినిమా వస్తుందా? ఏమో. ఐతే, ఇప్పటికే వీరిద్దరి కలిసి నటించారు ఒక బ్రాండ్ కోసం.
దీపిక, ఆమె భర్త రణ్వీర్ సింగ్, అందాల త్రిష కూడా చేతులు కలిపారు. ఈ నలుగురు కలిసి నటించారు. ఈ యాడ్ ఈ నెల 5న విడుదల కానుంది. ఇప్పటికే ఒక చిన్న ప్రోమోని వదిలారు. సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ పొందింది.
చరణ్ తండ్రి మెగాస్టార్ చిరంజీవితో త్రిష ‘స్టాలిన్’ సినిమాలో నటించింది. త్వరలోనే మరోసారి మెగాస్టార్ తో నటించనుంది. ఐతే, ఇప్పుడు చరణ్ తో ఆమె ఒక యాడ్ లో స్క్రీన్ పంచుకోవడం విశేషం. “మీషో” అనే ఫ్యాషన్ బ్రాండ్ కోసం రామ్ చరణ్, రణ్వీర్, దీపిక, త్రిష నటించారు.
“ఆర్ ఆర్ ఆర్” సినిమా తర్వాత రామ్ చరణ్ కి చాలా బ్రాండ్స్ తన ఖాతాలోకి వచ్చాయి. అందులో ఇదొకటి. ఐతే, ఇది మల్టీస్టారర్ యాడ్ కావడం విశేషం.
This post was last modified on July 3, 2023 3:58 pm