Advertisement
తెలుగు న్యూస్

దేవర తప్పుకోవడంతో…!

ఎన్టీఆర్ నటిస్తున్న “దేవర” చిత్రం షూటింగ్ లో జాప్యం జరుగుతోంది. దాంతో ఈ సినిమా విడుదల వాయిదా పడింది. ఏప్రిల్ 5, 2024న విడుదల కావాల్సిన “దేవర” మరో కొత్త డేట్ ని వెతుక్కుంటోంది. త్వరలోనే ఈ కొత్త డేట్ ఏంటనేది చెప్తారు.

మరోవైపు, ఒక పెద్ద సినిమా తప్పుకుంటే మిగతా సినిమాలు ఆ డేట్ ని లాక్కోలనుకోవడం సాధారణం. ఇప్పుడు ఆ పనిని విజయ్ దేవరకొండ నటిస్తున్న “ఫ్యామిలీ స్టార్” చేసింది. ఏప్రిల్ 5న “ఫ్యామిలీ స్టార్”ని విడుదల చెయ్యనున్నారు.

ఇక వారం ముందు “టిల్లు స్క్వేర్” విడుదల కానుంది. మార్చి 29న విడుదల చేయబోతున్నట్లు తాజాగా నిర్మాతలు ప్రకటించారు. ఇక ఏప్రిల్ మూడో వారం, నాలుగో వారం సినిమాలను కూడా లాక్ చేస్తారు. ప్రస్తుతం ఆ స్పెస్ అంతా ఖాళీగా ఉంది.

ఈ సారి వేసవికి పెద్ద సినిమాల కన్నా మిడ్ రేంజ్ సినిమాల హడావిడి ఎక్కువ ఉంటుంది.

Advertisement

This post was last modified on January 26, 2024 11:15 am

Advertisement
Share