Advertisement
తెలుగు న్యూస్

పవిత్రతో పెళ్లి…నరేష్ మాట ఇదే!

నరేష్, పవిత్ర లోకేష్ ప్రేమాయణం గురించి అందరికీ తెలిసిందే. ఆయన ఇంతకుముందు మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. ఆమె ఇంతకుముందు ఒకసారి డివోర్స్ తీసుకున్నారు. లేట్ వయసులో వీరిది ఘాటు ప్రేమ. ఐతే లీగల్ పెళ్లి చేసుకున్నారా లేదా? ఇదే అందరికీ డౌట్.

ఇంతకుముందు తమకి పెళ్లి జరిగినట్లు ఈ జంట ఒక ప్రకటన చేసింది. కానీ అదంతా ‘మళ్ళీ పెళ్లి’ అనే సినిమా ప్రమోషన్ లో భాగం అని తేలింది. మరి రియల్ లైఫ్ లో వీరి బంధానికి ‘సీల్’ పడిందా? ఇదే ప్రశ్నను ‘మళ్ళీ పెళ్లి’ ట్రైలర్ లాంచ్ వేదిక వద్ద జర్నలిస్టులు అడిగారు. దానికి నరేష్ ఇచ్చిన సమాధానం చూడండి.

“కొందరు తాళి కడుతారు. కొందరు రింగులు మార్చుకుంటారు. ఇంకో మతం వాళ్ళు ఇంకో తీరుగా పెళ్లి చేసుకుంటారు. నా దృష్టిలో పెళ్లి అంటే యూనియన్ ఆఫ్ హార్ట్స్ (మనసుల కలియక). మాది యూనియన్ ఆఫ్ హార్ట్స్,” అని చెప్పాడు.

ఆయన సమాధానాన్ని బట్టి పెళ్లి అయిందా అంటే అయినట్లే. మరి అలా డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా? ఇక్కడే ఆయనకి ఓ సమస్య ఉంది. నరేష్ తన మూడో భార్య రమ్య రఘుపతి నుంచి లీగల్ గా విడాకులు తీసుకోలేదు. ఆమెకి విడాకులు ఇవ్వకుండా పవిత్రని పెళ్లి చేసుకోలేదు కదా. సో, ఒకవేళ సీక్రెట్ గా జరిగినా…. బయటికి చెప్పుకోలేరు కదా.

అందుకే 60 ఏళ్ల నరేష్, 44 ఏళ్ల పవిత్ర లోకేష్ ‘హృదయాలు కలిశాయి’ అని చెప్తున్నారు.

Advertisement

This post was last modified on May 11, 2023 2:38 pm

Advertisement
Share