Advertisement
తెలుగు న్యూస్

లక్ష్మణ్ ని ఇరుకున పెట్టిన దిల్ రాజు?


ఒకప్పుడు దిల్ రాజు – శిరీష్ – లక్ష్మణ్ ముగ్గురు పేర్లు కలిసికట్టుగా వినిపించేవి. దిల్ రాజు నిర్మాతగా బిజీగా ఉండడంతో శిరీష్ నిర్వహణ బాధ్యతలు, లక్ష్మణ్ డిస్ట్రిబ్యూషన్ వ్యవహారాలు చూసేవారు. కానీ దిల్ రాజుతో విభేదించి లక్ష్మణ్ బయటికొచ్చారు. సొంతంగా డిస్ట్రిబ్యూషన్ కంపెనీ స్టార్ట్ చేశారు లక్ష్మణ్. మొదటి ప్రయత్నంగా ఆయన విడుదల చేసిన ‘జాతిరత్నాలు” బ్లాక్ బస్టర్ అయింది. దాంతో, దిల్ రాజ్ అంటే అసూయ, కోపం ఉన్న నిర్మాతలు లక్ష్మణ్ ని డిస్ట్రిబ్యూటర్ గా ప్రోమోట్ చేసే పనిలో పడ్డారు.

కానీ, లక్ష్మణ్ చేసిన ఒక పనితో ఇప్పుడు దిల్ రాజ్ దే పైచేయి అయింది.

నాని నటించిన ‘టక్ జగదీష్’ సినిమా మొత్తం డిస్ట్రిబ్యూషన్ హక్కులను లక్ష్మణ్ కొన్నారు. కానీ కరోనా కారణంగా ఈ సినిమాని థియేటర్లో విడుదల చేయలేమని భావించారు ఆ సినిమా నిర్మాతలు. అమెజాన్ నుంచి మంచి డీల్ రావడంతో లక్ష్మణ్ తో ముందు చేసుకున్న అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయించుకున్నారు. ఒకవేళ లక్ష్మణ్ గట్టిగా పడి ఉంటే…నిర్మాతలు ఓటిటి అమ్మేవారు కాదు. కానీ లక్ష్మణ్ అలా చెయ్యలేదు. దాంతో, దిల్ రాజుకి ఆయుధం దొరికింది.

ఎవరైనా అక్టోబర్ లోపు తమ సినిమాలను ఓటిటికి ఇస్తే వారిని ఎంకరేజ్ చెయ్యమని తీర్మానించింది తెలంగాణ థియేటర్ల సంఘం. లక్ష్మణ్ దీన్ని ఉల్లంఘించి ఒప్పందం రద్దు చేసుకున్నారు కాబట్టి థియేటర్ల సంఘం వద్ద ఆయన పలుకుబడి పోయింది. “ఇండస్ట్రీ కోసం, థియేటర్ల కోసం ఆలోచించిందే తాము మాత్రమే,” అని చెప్పుకోవడానికి దిల్ రాజుకి ఇప్పుడు అవకాశం దక్కింది. అలా లక్ష్మణ్ వీక్ అయ్యారు.

అందుకే దిల్ రాజు వరుసగా ‘పాగల్’, ‘సీటిమార్’ వంటి సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు.

Advertisement

This post was last modified on August 9, 2021 1:54 pm

Advertisement
Share