Advertisement
తెలుగు న్యూస్

బెదిరిస్తే ‘అక్కడ’ కొడుతా!


ప్రభాస్ అభిమానులు కొంచెం వైల్డ్ గా ఉంటారు. వాళ్ళకి తగ్గట్లే ఉన్నాడు ‘రాధే శ్యామ్’ డైరెక్టర్. సినిమా అప్డేట్ చెప్పకపోతే చచ్చిపోతామని ప్రభాస్ అభిమానులు తరుచుగా సోషల్ మీడియా వేదికగా బెదిరింపులు చేస్తుంటారు. నిన్న ‘రాధే శ్యామ్’ దర్శకుడు రాధాకృష్ణ కుమార్ అభిమానులతో జరిపిన ట్విట్టర్ చాట్ లో ఒక అభిమాని ఇలాగే చేశాడు.

“అన్న రిప్లై ఇవ్వకపోతే సూసైడ్ లెటర్ రాస్తాను,” ప్రభాస్ ఫ్యాన్ పోస్ట్. దానికి ఆ దర్శకుడి ఇచ్చిన రిప్లై ఇది – “ఇలా బెదిరిస్తే వచ్చి బమ్స్ మీద కొడుతా.”

పోస్ట్ పెట్టిన అభిమానిది వెర్రితనం అయితే దానికి తగ్గట్లే దర్శకుడు కూడా రియాక్ట్ అయ్యాడు. ఇద్దరికీ ఇద్దరూ సరిపోయారు.

మరోవైపు, ‘రాధే శ్యామ్’ సినిమా విడుదల విషయంలో ఆ టీం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ మూవీ నిరవధికంగా వాయిదా పడింది. ఈ సినిమాని డైరెక్ట్ గా రిలీజ్ చేసేందుకు ఓటిటి కంపెనీలు “భారీ” మొత్తం ఆఫర్ చేశాయని మీడియా, సోషల్ మీడియా వార్తలు గుప్పిస్తున్నాయి. కానీ సినిమాని ముందు థియేటర్లలోనే విడుదల చేస్తారు.

Advertisement

This post was last modified on January 12, 2022 2:09 pm

Advertisement
Share