Advertisement
తెలుగు న్యూస్

మళ్ళీ మొదలైన డూపుల హవా!


వెనకటి కాలంలో ఫైటింగ్ సీన్లు అంటే డూపులు చేసేవారు. హీరోలు తమ ముఖం కనిపించే షాట్ లలో కనిపించేవారు. మిగతావన్నీ గోడలు దూకడం, కట్టి ఫైట్లు, ఎగరడాలు, ముష్టి యుద్దాలు, ఫైట్లు అన్నీ డూపుల బాధ్యత. అప్పట్లో హీరోల డూప్ లకు బాగా డిమాండ్ ఉండేది. చిరంజీవి శకంతో మార్పు వచ్చింది.

చిరంజీవి డ్యాన్సులు, ఫైట్లతో కొత్తదనానికి నాంది పలికారు తెలుగు చిత్రసీమలో. ఆ తర్వాత డూపుల హవా తగ్గింది. ఏవో కొన్ని రిస్కీ ఫైట్లు తప్ప మిగతావన్నీ హీరోలే చెయ్యడం అనే ట్రెండ్ మొన్నటివరకు కొనసాగింది. పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి కొత్త తరం హీరోలు ఫైట్లు, డ్యాన్స్ ల విషయంలో రియలిస్టిక్ అప్రోచ్ ని పాటించారు. అందుకే వారు అంత పెద్ద స్టార్స్ అయ్యారు.

కానీ, ఇప్పుడు మళ్ళీ డూపుల హవా మొదలైంది. దాదాపు ఇప్పుడు ఉన్న పెద్ద హీరోలందరూ 40 ప్లస్ వాళ్లే. అందరికీ మోకాళ్ళ నొప్పులు. ఇతరత్రా ఆరోగ్య సమస్యలు. దాంతో, ప్రతి ఫైట్ లో డూపులను పెడుతున్నారు. హీరో క్లోజ్ షాట్ కి మాత్రమే నిజమైన హీరో ఉంటాడు. మిగతావన్నీ హీరోల డూపులే కానిస్తున్నారు.

ఒక పెద్ద హీరో తాను ఏఏ షాట్ లలో నటించగలనో, ఏఏ షాట్ లలో డూప్ ని పెట్టుకోవాలో కూడా దర్శకుడికి చెప్పేస్తున్నాడట. చిన్న ఫైట్ కి కూడా డూపులు వాడని పెద్ద హీరో ఇప్పుడు తెలుగులో లేడు.

మరోవైపు, హాలీవుడ్ లో టామ్ క్రూజ్ వంటి 60 ఏళ్ల హీరోలు ఇప్పటికీ సొంతంగా కళ్ళు చెదిరే యాక్షన్ సన్నివేశాలు చేస్తున్నారు.

Advertisement

This post was last modified on September 26, 2022 10:35 am

Advertisement
Share