Advertisement
తెలుగు న్యూస్

గేమ్ ఛేంజర్… ఆగుతూ సాగుతూ!

రామ్ చరణ్ హీరోగా శంకర్ తీస్తున్న “గేమ్ ఛేంజర్” మూవీ రెండున్నరేళ్లుగా కొనసా…… గుతోంది. 3 రోజులు షూటింగ్ చేస్తే 15 రోజులు బ్రేక్ తీసుకుంటున్నారు. ఈ నెల 10న కొత్త షెడ్యూల్ ప్రారంభించినట్లు దర్శకుడు శంకర్ ఘనంగా ప్రకటించారు. నాలుగు రోజుల తర్వాత బ్రేక్ పడింది. ఇప్పుడు రామ్ చరణ్ ఇటలీ వెళ్లారు.

10 రోజుల పాటు అక్కడే ఉంటారు. వరుణ్ తేజ్ పెళ్లితో పాటు మరో ఫ్రెండ్ పెళ్లి కూడా అటెండ్ అయి నవంబర్ మొదటివారంలో ఇండియాకి వస్తారని టాక్. అంటే మళ్ళీ “గేమ్ ఛేంజర్” షూటింగ్ నవంబర్ లోనే ఉంటుంది. ఈ సినిమా షూటింగ్ అలా లాంగ్ బ్రేకులు తీసుకుంటూ సాగుతోంది.

నిర్మాత దిల్ రాజు ఈ సినిమాని తమ సంస్థ 50వ చిత్రంగా విడుదల చేద్దామని ఘనంగా ప్లాన్ చేశారు. కానీ, షూటింగ్ అలా అలా అలా వెళుతోంది. ఇప్పుడు దానికన్నా ముందు 54వ చిత్రం (విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’) ముందు విడుదల కానుంది. 50వ చిత్రం ఇంకా విడుదల కాలేదు. కానీ 54 ముందే రానుంది.

ఐతే, ‘గేమ్ ఛేంజర్’ ఎప్పుడొచ్చినా సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని రామ్ చరణ్ గట్టిగా నమ్ముతున్నారు. “ఆర్ ఆర్ ఆర్” తర్వాత తనకు ఇది సరైన పాన్ ఇండియా మూవీ అని రామ్ చరణ్ భావిస్తున్నారు. శంకర్ గత చిత్రాల ట్రాక్ రికార్డు అలాంటిది. అందుకే, శంకర్ ఎంత లేట్ చేసినా రామ్ చరణ్ ఓపిగ్గా మూవీ చేస్తున్నారు.

Advertisement

This post was last modified on October 18, 2023 11:08 pm

Advertisement
Share