Advertisement
తెలుగు న్యూస్

మళ్ళీ వాయిదాపడ్డ ‘గుడ్ లక్ సఖి’

ఇప్పటికే అనేకసార్లు వాయిదాపడింది కీర్తి సురేష్ మూవీ. గతేడాది నుంచి ఇప్పటికే ఒక 10 సార్లు రిలీజ్ డేట్ ప్రకటించడం, వాయిదా వెయ్యడం జరిగింది. లేటెస్ట్ గా ఇంకో డేట్ వచ్చింది. మొన్నటివరకు నవంబర్ 26 అంటూ ఊదరగొట్టిన ఈ సినిమా మేకర్స్ ఇప్పుడు డిసెంబర్ 10న విడుదల చేయబోతోన్నట్టు ప్రకటించారు.

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నగేష్ కుకునూర్ దర్శకత్వం వహించిన `చిత్రం గుడ్ లక్ సఖి. ఆది పినిశెట్టి, జగపతి బాబు కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు.

“‘పలు కారణాల వల్ల ఈ సినిమాను వాయిదా వేశాం. మరికొన్ని సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి, థియేటర్ల సమస్య ఏర్పడకుండా ఉండేందుకు, భారీ ఎత్తున ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ఇలా అన్ని కోణాల్లో ఆలోచించి ఈ నిర్ణయాన్ని తీసుకున్నాం. అన్ని విధాలుగా మాకు డిసెంబర్ 10న సరైన తేదీ అనుకున్నాం,”అని అన్నారు నిర్మాత సుధీర్ చంద్ర.

కీర్తి సురేష్ అగ్ర హీరోయిన్లలో ఒకరు. ఆమె నటించిన సినిమాకే రిలీజ్ కష్టాలు రావడం విచిత్రంగా ఉంది. కీర్తి హీరోయిన్ ఇటీవల నటించిన కొన్ని ఓరియెంటెడ్ చిత్రాలు బోల్తాకొట్టాయి. బహుశా అందుకే, ఈ సినిమాకి ఇన్ని కష్టాలు కాబోలు. ఐతే, దిల్ రాజు సమ్పరిస్తున్న మూవీ ఇది. దేవీశ్రీప్రసాద్ మ్యూజిక్ ఇస్తున్నారు. పెద్ద పేర్లు అటాచ్ అయి ఉన్నాయి ఈ సినిమాకి.

Advertisement

This post was last modified on November 15, 2021 6:53 pm

Advertisement
Share