Advertisement
తెలుగు న్యూస్

తొలి రోజు వసూళ్లపైనే గురి


ఇప్పుడు ఏ పెద్ద సినిమాకైనా మొదటి రోజు వసూళ్లు, మొదటి వీకెండ్ వసూళ్లు చాలా ఇంపార్టెంట్ అయ్యాయి. మొదటి రోజు ఎంత భారీగా వసూళ్లు పొందితే అంత త్వరగా సినిమా గట్టెక్కుతుంది. పెద్ద హీరోల సినిమాలకు సహజంగానే మొదటి రోజు కళ్ళు చెదిరే విధంగా ఉంటాయి వసూళ్లు. మహేష్ బాబులాంటి హీరోకి ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఐతే, “గుంటూరు కారం” విషయంలో మాత్రం టీం మరీ ఎక్కువగా మొదటిరోజుపైనే ఎక్కువ గురి పెట్టింది.

త్రివిక్రమ్ తీసిన “గుంటూరు కారం” సినిమా జనవరి 12న విడుదల అవుతోంది. అదే రోజు తెలుగునాట “హనుమాన్” విడుదల అవుతోంది. ఇక మర్నాడు అంటే జనవరి 13న వెంకటేష్ నటించిన “సైంధవ్‌”, రవితేజ మూవీ “ఈగిల్” విడుదల అవుతున్నాయి. జనవరి 14న నాగార్జున మూవీ “నా సామి రంగ” థియేటర్లలోకి వస్తోంది. అంటే జనవరి 12న తప్ప మిగతా ఏ రోజు కూడా “గుంటూరు కారం” సినిమాకి ఎక్కువ థియేటర్లు లభించవు. జనవరి 13 నుంచి మిగతా సినిమాలు థియేటర్లు లాగేసుకుంటాయి. దాంతో, కలెక్షన్లు కూడా తగ్గుతాయి. అందుకే, “గుంటూరు కారం” మొదటి రోజు మాక్జిమం వసూళ్లు పొందేలా ప్లాన్ చేస్తోంది.

“హనుమాన్” సినిమాకి మొదటి రోజు రెండు, మూడు థియేటర్లు ఇచ్చి… మిగతా అన్ని థియేటర్లు ప్రతిచోటా లాగేసుకుంటోంది మహేష్ బాబు మూవీ.

త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్ కి మంచి క్రేజుంది. పాటల పరంగా “గుంటూరు కారం” సినిమాకి ట్రోలింగ్ జరిగిన మాట వాస్తవమే కానీ సంక్రాంతికి ఎక్కువ క్రేజు, భారీ అంచనాలు ఉన్న మూవీ ఇదే. ట్రైలర్ విడుదల తర్వాత మరింత హైప్ పెరుగుతుంది.

శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న “గుంటూరు కారం” ఫ్యామిలీ చిత్రమే కానీ యాక్షన్ ఎలిమెంట్స్, మాస్ మూమెంట్స్ ఎక్కువే. సంక్రాంతి పండగకి జనం కోరుకునే అన్ని అంశాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి అని మేకర్స్ చెప్తున్నారు. మొదటి వారం టికెట్ ధరలు కూడా భారీగానే ఉంటాయి కాబట్టి ఈ సినిమాకి మొదటి రోజు వసూళ్లు “సలార్”కి దగ్గర్లోనే ఉండొచ్చు.

Advertisement

This post was last modified on January 3, 2024 10:06 am

Advertisement
Share