Advertisement
తెలుగు న్యూస్

ఫ్యాన్స్ కి నచ్చింది మాస్ స్ట్రైక్

మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ కి చాలా క్రేజుంది. ‘అతడు’ వంటి క్లాసిక్ మూవీ వీరి కలయికలో వచ్చింది. ‘ఖలేజా’ దారుణంగా ఫ్లాప్ అయింది కానీ దానికి కూడా కల్ట్ ఫాలోవర్స్ ఉన్నారు. అందుకే, వీరి కాంబినేషన్ లో మూడో చిత్రంపై అంతగా భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

సినిమా టైటిల్ నుంచి టైటిల్ వీడియో వరకు త్రివిక్రమ్ తన పంథాని పూర్తిగా మార్చేశారు. ‘అల వైకుంఠపురంలో’ వంటి కళ్ళు చెదిరే హిట్ తర్వాత త్రివిక్రమ్ ఎలాంటి సినిమా తీస్తారు అని ఇప్పటివరకు అందరిలో ఒక ప్రశ్న. త్రివిక్రమ్ స్పెషలిటీ ఏంటంటే ఫ్యామిలీ డ్రామాలో కూడా మాస్ ఎలిమెంట్ మిక్స్ చెయ్యడం. ఈ వీడియో గ్లిమ్ప్స్ చూస్తే అదే అనిపిస్తోంది. ఇది పక్కా మాస్ స్ట్రైక్. అభిమానులకు నచ్చుతుంది. నచ్చింది.

ఐతే, ఈ సినిమా ప్రధానంగా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఫ్యామిలీ డ్రామా. సాఫ్ట్ ఎలిమెంట్స్, మాస్ ఎలిమెంట్స్ రెండూ ఉంటాయి. ముందుగా కారం రుచి చూపించారు త్రివిక్రమ్. ‘గుంటూరు కారం’తో చేసిన ఆవకాయ ముద్దతో భోజనం పెట్టారు ముందు. అసలైన వంటకాలు, స్వీట్ తర్వాత ఉంటాయి.

‘గుంటూరు కారం’ అనే టైటిల్ కూడా భిన్నమే. కథ గుంటూరు నేపథ్యంగా సాగుతుంది కాబట్టి ఈ పేరు పెట్టారు. ఇంతకుముందు అనుకున్న ‘అ’ సెంటిమెంట్ టైటిల్ ని పక్కన పెట్టారు. ‘అమరావతికి అటూ ఇటూ’, ‘ఆరంభం’, ‘అయినను హస్తినకు పోయి రావలెను’ వంటి ‘అ’ టైటిల్స్ ని పక్కన పెట్టేశారు.

టైటిల్ నుంచి మొదటి గ్లిమ్ప్స్ వరకు అభిమానులకు, మాస్ కి నచ్చే విధంగా చేశారు త్రివిక్రమ్. సినిమా మాత్రం అన్ని వర్గాలకు నచ్చేలా ఉంటుందని ఘంటాపథంగా చెప్పొచ్చు.

Advertisement

This post was last modified on May 31, 2023 7:13 pm

Advertisement
Share