Advertisement
తెలుగు న్యూస్

పోటీకి రెడీ అంటున్న హేమ

తెలుగు సినిమా ఆర్టిస్టుల సంఘం (మా) అధ్యక్ష పదవికి పోటీపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ప్ర‌కాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత ఇప్పటికే బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. తాజాగా మరో నటి హేమ కూడా రంగంలోకి దిగుతున్నారు.

“మా”లో ఇప్పటికే ఆమె పలు పదవులు చేపట్టారు. ఇప్పుడు ఏకంగా అధ్యక్ష పదవికే గురిపెడుతున్నారు హేమ.

“పెద్ద‌లంతా బ‌రిలో దిగుతున్నారని తెలిసిన తర్వాత ఈసారి ఎన్నికలకు దూరంగా ఉందామని అనుకున్నాను. కానీ నిన్నటి నుంచి సినీప్ర‌ముఖుల నుంచి ఒత్తిడి మొదలైంది. నా స్నేహితులు, ముఖ్యంగా నటీమణులు ఫోన్ చేసి నువ్వెందుకు పోటీ చేయ‌కూడ‌దు. అర్థరాత్రి ఫోన్ చేసినా అందుబాటులో ఉంటావు…. కష్టాలు చెపితే వింటావు అని వారు అడుగుతున్నారు. అందుకే, ఇప్పుడు నేను కూడా అధ్యక్ష పదవికి పోటీలో ఉన్నాను, ” అని హేమ అంటున్నారు.

Advertisement

This post was last modified on June 23, 2021 3:37 pm

Advertisement
Share