Advertisement
తెలుగు న్యూస్

హీరోయిన్లు కూడా మనుషులే: మృణాల్

“హీరోయిన్లను మనుషులుగా ట్రీట్ చెయ్యరు చాలా మంది. ఎదో బొమ్మ అనుకుంటారు. అందుకే, వాళ్ళ శరీర భాగాలను జూమ్ చేసి, వాటికి రకరకాల కామెంట్స్ పెట్టి సోషల్ మీడియాలో పెడుతారు. ఒక పైశాచిక ఆనందం పొందుతారు…”

ఇలా బాధగా చెప్పింది హీరోయిన్ మృణాల్ ఠాకూర్. రష్మిక ఫేక్ వీడియో వచ్చిన తర్వాత పలువురు హీరోయిన్లు తమ అభిప్రాయం పంచుకున్నారు. ఈ విషయంలో మృణాల్ కొంచెం ఘాటుగానే స్పందించింది. ముందుగా ఇన్ స్టాగ్రామ్ లో తన అభిప్రాయాన్ని పోస్ట్ చేసింది. తాజాగా ఒక మీడియా సంస్థ ఇంటర్వ్యూలో కూడా నిర్మొహమాటంగా తన ఒపీనియన్ ని పేర్కొంది.

“ఇది ఒక్క ఫెక్ వీడియోకి సంబంధించినదే కాదు. సాధారణంగా ఏదైనా ఈవెంట్ కి మేం (హీరోయిన్లు) అటెండ్ అయినా.. అక్కడ వంగినప్పుడో, పక్కకు జరిగినప్పుడో ఆ ఫోటోలను జూమ్ చేసి ప్రత్యేకంగా కొన్ని శరీర భాగాలకు సంబందించిన ఫోటోలను షేర్ చేస్తుంటారు. ఈ దుష్ట పద్దతి మారాలి. ఆ విషయంలో కూడా చర్యలు తీసుకోవాలి,” అని మృణాల్ గట్టిగా మాట్లాడింది.

మృణాల్ చేతిలో ఇప్పుడు రెండు తెలుగు సినిమాలు ఉన్నాయి. నాని సరసన నటించిన “హాయ్ నాన్న” వచ్చే నెల విడుదల కానుంది. విజయ్ దేవరకొండతో చేస్తున్న “ఫ్యామిలీ స్టార్” జనవరిలో రిలీజ్ అవుతుంది.

Photos: Mrunal Thakur at a premiere show event

Advertisement

This post was last modified on November 9, 2023 7:21 pm

Advertisement
Share