Advertisement
తెలుగు న్యూస్

పూరికి నచ్చదనే ఛార్మి పెళ్లి చేసుకోవట్లేదా?

గత కొన్నాళ్లుగా దర్శకుడు పూరి జగన్నాధ్ మ్యూజింగ్స్ పేరుతో వివిధ అంశాలపై తన ఆలోచనలను ఆడియో రూపంలో విడుదల చేస్తున్నారు. ఇవి తెగ పాపులర్ అయ్యాయి. నిత్యం వాటి కోసం ఎదురు చూసే వారెందరో ఉన్నారు. అంత బాగుంటాయి ఆయన ‘మ్యూజింగ్స్’.

లేటెస్ట్ గా ఎంచుకున్న టాపిక్… ‘సింగిల్ బై చాయిస్’. హీరోయిన్లు, గ్రేట్ విమెన్ పెళ్లి చేసుకోవద్దన్నదే ఆయన మాట.

“హీరోయిన్లు పెళ్లి చేసుకుంటే నాకు నచ్చదు. హీరోయిన్లను అభిమానులు దేవతలా ఆరాధిస్తారు. మరి దేవతలు పురిటి నొప్పులు పడడం విన్నామా? అలాగే, అలాంటి దేవతలు మెటర్నిటీ వార్డుల్లో నొప్పులు పడుతుంటే నేను చూడలేను. పిల్లలని కనాలని మనుషులకు ఉంటుంది. దేవతలకు ఉండదు. మీరు (హీరోయిన్లు) కూడా దేవతల్లా ఉంటేనే మంచిది,” అని పూరి ఈ మ్యూజింగ్స్ లో చెప్పారు.

బహుశా ఛార్మి అందుకే కాబోలు పెళ్లి మాట ఎత్తడం లేదు. ఛార్మి… పూరి జగన్నాధ్ నిర్మాణ సంస్థలో భాగస్వామి. ఆయన ఇటీవల తీసిన ‘ఇస్మార్ట్ శంకర్’, తాజాగా తీస్తున్న ‘లైగర్’ సినిమాల నిర్మాణ బాధ్యతలన్నీ ఆమెవే. సూపర్ ప్రొడ్యూసర్ అనిపించుకొంది.

మరి పూరి క్యాంప్ లో ఉంటున్న ఛార్మి ఆయన అభిప్రాయాలను గౌరవిస్తూ పెళ్లి చేసుకోవడం లేదా అన్న డౌట్ వస్తుంది కదా! అన్నట్లు ఛార్మి తన పెళ్లి చేసుకోబోతున్నట్లు వచ్చిన వార్తలను తోసిపుచ్చింది.

Advertisement

This post was last modified on June 17, 2021 3:31 pm

Advertisement
Share