Advertisement
తెలుగు న్యూస్

హనీ రోజ్ ని పట్టించుకోరే?

కేరళకి చెందిన హానీ రోజ్ బాలయ్య సరసన ‘వీరసింహారెడ్డి’ సినిమాలో నటించి పాపులర్ అయింది. ఆ సినిమాలో ఆమె వయసుమళ్ళిన మహిళగా కనిపించింది. కానీ ఇన్ స్టాగ్రామ్ లో మాత్రం ఆమె వేరు.

మాంచి గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ కుర్రకారుని ఆకట్టుకుంటుంది హానీ రోజ్. ఆమె వయసు 31 ఏళ్ళు. కాకపోతే మంచి పుష్టిగా ఉంటుంది. చీర కట్టు అందాలతో, బాడీ హగ్గింగ్ డ్రెస్ లతో ఫోటోషూట్లు చేసి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంటుంది. ఇదంతా బానే ఉన్నా…. ఆమెకి కొత్తగా ఆఫర్లు రావడం లేదు.

ఆ మాటకొస్తే, ఈ సంక్రాంతికి విడుదలై సూపర్ హిట్టైన ‘వాల్తేర్ వీరయ్య’, ‘వీర సింహారెడ్డి’ చిత్రాల్లో నటించిన భామలెవ్వరికీ మరో అవకాశం లేదు. హీరోయిన్ శృతి హాసన్ కి ఇంకో కొత్త మూవీ రాలేదు. ఈ రెండు సినిమాలకు ముందే ఆమె ‘సలార్’ ఒప్పుకొంది. అది మాత్రమే ఇప్పుడు ఆమె చేతిలో ఉంది. అలాగే, ఐటెం భామలుగా నటించిన చంద్రిక రవి (వీరసింహా రెడ్డి), ఊర్వశి రౌతేలా (వాల్తేర్ వీరయ్య)ల పరిస్థితి కూడా అంతే.

అందుకే, సోషల్ మీడియాలో ఎంత హంగామా చేసినా హానీ రోజ్ ని తెలుగు ఫిల్మ్ మేకర్స్ పట్టించుకోవడం లేదు.

Advertisement

This post was last modified on April 9, 2023 4:06 pm

Advertisement
Share