Advertisement
తెలుగు న్యూస్

నాకు లైన్ వేస్తే యూజ్ ఉండదు!

– ఫేవరెట్ కార్టూన్?
టామ్ అండ్ జెర్రీ.

– ప్రస్తుతం చేస్తున్న వర్కవుట్ ఏంటి?
ప్రస్తుతం ఆన్ లైన్ వర్కవుట్ ప్రొగ్రామ్ ఫాలో అవుతున్నాను. ఇది 80 రోజుల కార్యక్రమం. ప్రస్తుతం నా 6వ రోజు వర్కవుట్ నడుస్తోంది. ఇది చాలా కష్టంగా ఉంది కానీ బాగుంది. ఏమాత్రం తేడా కొట్టినా గాయాలు గ్యారెంటీ.

– ఇలియానా అంటే అర్థం ఏంటి?
అదొక గ్రీక్ పదం. సూర్యోదయం, ప్రకాశంవంతమైనది అని అర్థం. 

– పాటలు పాడతారా?
నేను పాటలు పాడగలననే అనుకుంటున్నాను. ఎందుకో ఈ మాట చెబుతుంటే సిగ్గేస్తోంది.

– మీ జుట్టు సీక్రెట్?
మా అమ్మ నుంచి వచ్చింది అది.

– ఎవరైనా మిమ్మల్ని లవ్ లో పడేయాలని ప్రయత్నిస్తుంటే ఏం చేస్తారు?
అందంగా ఉన్నంత వరకు ఓకే. అసభ్యంగా, చిరాగ్గా ఉంటే మాత్రం ఇద్దరికీ ఇబ్బందికరమే. అయినా నాకు ఎవ్వరూ డేటింగ్ సలహాలు ఇవ్వొద్దు. నాకు లైన్ వెయ్యాలనే ప్రయత్నం చెయ్యొద్దు… యూజ్ ఉండదు మీకు. 

– ఇంతకీ  సింగిలా లేక ఎవరైనా ఉన్నారా?
(ఇలా అడిగితెనే మండుద్ది..  అన్నట్లుగా కోపంగా, చిరాగ్గా ఉండే ఎమోజీ పెట్టి తన అసహనాన్ని చూపించింది.) 

Advertisement

This post was last modified on July 1, 2020 5:40 pm

Advertisement
Share