సూర్యకు మద్దతుగా సెలెబ్రిటీలు


సూర్య నటించి, నిర్మించిన ‘జై భీమ్’ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకొంది. సామాన్య ప్రేక్షకులను కూడా మెస్మరైజ్ చేసింది. అమెజాన్ ప్రైమ్ లో డైరెక్ట్ గా విడుదలైన ఈ మూవీ దేశమంతా హాట్ టాపిక్ గా మారింది. ఐతే, తమిళనాట మాత్రం రాజకీయ దుమారం రేపుతోంది.

తమిళనాడులో ‘వన్నియార్’ అనే సామాజికవర్గం వారిని కించపరిచేలా ఈ సినిమాలో సన్నివేశాలను పెట్టారని ఆ కుల సంఘ ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఈ సినిమాకి వ్యతిరేకంగా పీఎంకే అనే పార్టీ ఉద్యమం మొదలుపెట్టింది. ఈ పార్టీకి వన్నియార్ కులానికి సంబంధం ఉంది. చిలికి చిలికి ఈ వివాదం ఇప్పుడు పెద్ద రాజకీయ రచ్చకి దారితీయడంతో సూర్య ఇప్పటికే వివరణ ఇచ్చారు.

తమిళనాడులో సూర్య సినిమాలను నిషేధిస్తామని పీఎంకే పార్టీ హెచ్చరికలు జారీచేసేవరకు వచ్చింది పరిస్థితి. దాంతో, సూర్యకి మద్దతుగా నిలుస్తున్నారు పలువురు సెలెబ్రిటీలు. ఐ స్టాండ్ విత్ సూరియా అనే హాష్టాగ్ కూడా ట్రెండ్ అవుతోంది ట్విట్టర్లో.

సూర్య మాత్రం తాను క్షమాపణలు చెప్పేది లేదని తెగేసి చెప్పారు. సినిమా కథ నిజంగా జరిగిన ఘటనల ఆధారంగా రూపొందినది. అందుకే, ఈ విషయంలో సూర్య వెనకడుగు వెయ్యట్లేదు. అధికార పార్టీ డీఎంకే కూడా సూర్యకి మద్దతిస్తోంది.

TeluguCinema

TeluguCinema

  • Video

Video: Rashi Singh charms in a simple Chudidhar

View this post on Instagram A post shared by Telugucinema.com (@telugucinemacom) Rashi Singh was busy…

5 hours
  • News

Chiranjeevi congratulates Samantha on double celebration

The success of "Maa Inti Bangaaram" has turned even more special for Samantha. Megastar Chiranjeevi…

5 hours
  • News

Audiences reject Vadde Naveen’s return to the big screen

Vadde Naveen was one of the stars of the 1990s in Telugu film industry. Though…

6 hours
  • OTT

Marmadesam Returns: ‘Veerabhadruni Rahasyam’ to premiere on ZEE5

The iconic mystery franchise "Marmadesam" is making a comeback with a new chapter, "Veerabhadruni Rahasyam…

7 hours
  • News

Kajal Aggarwal opens up about NBK111: A powerful role

Kajal Aggarwal has shared exciting details about her role in NBK111, the upcoming action entertainer…

9 hours
  • OTT

Satyadev’s Rao Bahadur OTT deal closed for a good price

At a time when even big-budget and star-driven films are finding it difficult to secure…

10 hours