Advertisement
తెలుగు న్యూస్

అది గొడవ, డివోర్స్ కాదు!


ధనుష్, ఆయన భార్య ఐశ్వర్య విడిపోతున్నట్లు ప్రకటించి రెండు రోజులయింది. ఐతే, ధనుష్ తండ్రి అది తప్పని చెప్తున్నారు. “వాళ్ళు చిన్న గొడవ పడ్డారు. ప్రతి ఇంట్లో ఉండే ఫ్యామిలీ గొడవనే. అది డివోర్స్ కాదు.” ఇది ధనుష్ తండ్రి కస్తూరిరాజా మాట.

తండ్రిగా అది ఆయన ఆశ కావొచ్చు. ధనుష్, ఐశ్వర్య ఇద్దరూ ఇప్పటికే మూవ్ ఆన్ అయినట్లు కనిపిస్తోంది. పబ్లిక్ గా ప్రకటన వచ్చిన తర్వాత ఇంకా రాజీ ఏమి ఉంటుంది?

ALSO READ: 3 నెలల్లోనే అంతా తారుమారు!

ధనుష్ తాను తెలుగులో నటిస్తున్న ‘సార్’ సినిమా షూటింగ్ కి కూడా బ్రేక్ ఇచ్చాడు. ప్రస్తుతం సైలెంట్ అయిపోయాడు ఈ హీరో. సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా తన ప్రయత్నాలు అన్ని చేసి వదిలేశారట. ఇప్పటికే, పలుసార్లు గొడవపడ్డ ఈ జంట ఇక కలిసి ఉండలేమని నిర్ణయించుకున్నాకే సోషల్ మీడియా ద్వారా ప్రకటన చేశారని తెలుగుసినిమా.కామ్ కి తెలిసిన సమాచారం.

Advertisement

This post was last modified on January 19, 2022 9:58 pm

Advertisement
Share