Advertisement
తెలుగు న్యూస్

సాంతం… గిఫ్టులే గిఫ్టులే!


సుఖేష్ చంద్ర‌శేఖ‌ర్ కేసులో బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ అడ్డంగా ఇరుక్కొంది. అతనితో చాలా కాలం డేటింగ్ చేసింది. డేటింగ్ సమయంలో అతను ఆమెకి బోలెడన్ని బ‌హుమ‌తులు ఇచ్చాడు. జాక్వెలిన్ తో పాటు మరో నటి నోరా ఫతేహా కూడా సుఖేష్ నుంచి గిఫ్టులు ఫుల్లుగా తీసుకొంది.

అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం ఆమె సుఖేష్ చంద్రశేఖర్ నుంచి తీసుకున్నగిఫ్టులు ఇవి…

రోలెక్స్ వాచులు
15 చెవి రింగులు
గాజులు
బ్యాగులు
డైమండ్ ఆభరణాలు
మినీ కూపర్ కారు
జాక్వెలిన్ తల్లికి Porche
ఆమె సిస్టర్ కి BMW కారు

వీటి అన్నిటి విలువ 7, 8 కోట్ల రూపాయల విలువ ఉంది. ఒక విధంగా చూస్తే ‘అదుర్స్’ సినిమా డైలాగ్ గుర్తొస్తుంది. జాక్వెలిన్, ఆమె తల్లి, ఆమె చెల్లి… ఇలా ఇంటిల్లిపాది బహుమతులు అందుకున్నారు.

సుఖేష్ తో డేటింగ్ కట్ కాగానే ఆమె సల్మాన్ ఖాన్ తో చనువుగా ఉండడం మొదలుపెట్టిందట. ఆమె అరెస్ట్ కాబోతుందన్న వార్తల నేపథ్యంలో ఈ వివరాలు బయటికి వచ్చాయి.

Advertisement

This post was last modified on December 14, 2021 7:07 pm

Advertisement
Share