Advertisement
తెలుగు న్యూస్

‘నాకు రెమ్యూనరేషన్ లేదు’

సెకెండ్ ఇన్నింగ్స్ లో ఫుల్ బిజీ అయిన జగపతిబాబు తన రెమ్యూనరేషన్ పై బాంబ్ పేల్చాడు. తనకు ఫిక్స్ డ్ పారితోషికం లేదని ప్రకటించాడు ఈ సీనియర్ నటుడు కమ్ మాజీ హీరో. సెకెండ్ ఇన్నింగ్స్ ను తను పూర్తిస్థాయిలో ఎంజాయ్ చేస్తున్నానని, డబ్బు గురించి పెద్దగా పట్టించుకోవడం లేదని అంటున్నాడు.

“నటుడిగా కొత్త జీవితం ప్రారంభించిన తర్వాత చాలా ఎక్స్ పోజర్ వచ్చింది. చాలా పరిశ్రమలు చూస్తున్నాను. కొత్త కొత్త పాత్రలు చేస్తున్నాను. చాలామంది కొత్త నటీనటుల్ని కలుస్తున్నాను. ఈ ఫేజ్ ను నేను ఎంజాయ్ చేస్తున్నాను. డబ్బు అస్సలు ఇంపార్టెంట్ కాదు. చెప్పాలంటే ఇప్పటివరకు నేను నా రెమ్యూనరేషన్ ఫిక్స్ చేయలేదు. ఆమధ్య ఓ సినిమా ఫ్రీగా చేయడానికి కూడా రెడీ అయ్యాను. కానీ వేరే కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది.”

ఇలా తన పారితోషికంపై స్పందించాడు జగపతి బాబు. ఏ ఇండస్ట్రీలో సినిమా చేస్తున్నాం.. సబ్జెక్ట్ ఏంటి, హీరో ఎవరు, మూవీ బడ్జెట్ ఎంత లాంటి అంశాల ఆధారంగా తన రెమ్యూనరేషన్ కూడా మారిపోతుందంటున్నాడు జగపతిబాబు.

అయితే అగ్రిమెంట్ టైమ్ లోనే ఎంతిస్తారనే విషయాన్ని క్లియర్ గా అడిగి తెలుసుకుంటానని, పెద్దగా పట్టుబట్టనని చెబుతున్నాడు ఈ సీనియర్ నటుడు. క్యారెక్టర్ రోల్స్ కు షిఫ్ట్ అయిన తర్వాత జగపతిబాబు ఫుల్ బిజీ అవ్వడానికి ఇది కూడా ఓ కారణమేమో.

Advertisement

This post was last modified on October 23, 2020 11:25 am

Advertisement
Share