Advertisement

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల వేడి ఊపందుకొంది. ఎన్నికలు రెండు నెలలో జరగనున్నాయి. కానీ అప్పుడే కాకా పుట్టిస్తున్నారు బరిలోకి దిగుతున్న అభ్యర్థులు. ఇక ‘మా’కి తొలి మహిళా అధ్యక్షురాలిని అవ్వాలనేది జీవిత కోరిక. ఐతే, అటు ప్రకాష్ రాజు, ఇటు మంచు విష్ణు ముందే బరిలోకి దిగారు. ప్రకాష్ రాజు తన ప్యానెల్ ఇది అని కొందరి నటుల పేర్లు కూడా ప్రకటించారు.

మరి, జీవిత తరఫున ప్యానెల్లో ఎవరెవరు ఉంటారు అనేది ప్రశ్న. ఆమె సోలో ఫైట్ చేయాలనుకుంటున్నట్లు టాక్. అంటే, ఆమె ప్రెసిడెంట్ పదవికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీచేస్తారు. తన తరఫున ప్యానెల్ ని నిలిపే అవకాశం లేదు.

జీవితకి నందమూరి బాలకృష్ణ వర్గం మద్దతు ఉందని ప్రచారం జరుగుతోంది. చిరంజీవి మద్దతుతో బరిలోకి దిగుతున్న ప్రకాష్ రాజ్ కి పోటీగా జీవితని నిలుపుతున్నారట.

Advertisement

This post was last modified on June 27, 2021 6:57 pm

Advertisement
Share