Advertisement
తెలుగు న్యూస్

సెట్స్ పైకి పెద్ద సినిమాలు

రెండో లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత ఇప్పటికే “ఆర్ ఆర్ ఆర్” వంటి పెద్ద సినిమాలు షూటింగ్ ని షురూ చేశాయి. ఇక గురువారం నుంచి వరుసపెట్టి పెద్ద సినిమాలు సెట్స్ పైకి రానున్నాయి.

F3
వెంకటేష్, వరుణ్ తేజ్ నటిస్తున్న మూవీ ఇది. అనిల్ రావిపూడి దర్శకుడు. జులై 1 నుంచి హైదరాబాద్ లో వివిధ ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతుంది. దాదాపు 10 రోజుల పాటు ఈ షెడ్యూల్ ఉంటుంది. వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్న, మెహ్రీన్, సునీల్ షూటింగ్ లో పాల్గొంటారు.

రవితేజ మూవీ
కొత్త దర్శకుడు శరత్ మండవ తీస్తున్న కొత్త తరహా మూవీలో రవితేజ నటిస్తున్నారు. రెగ్యులర్ షూటింగ్ జులై 1 నుంచి షురూ. హైదరాబాద్ లోనే చిత్రీకరణ. ‘మజిలీ’ఫేమ్ దివ్యంశ కౌశిక్ హీరోయిన్.

బీస్ట్
తమిళ సూపర్ స్టార్ విజయ్, పూజ హెగ్డే నటిస్తున్న మూవీ. చెన్నైలో డ్యూయెట్ షూటింగ్. జులై 1 నుంచి ప్రారంభం. ఇప్పటికే, ఈ పాట కోసం రిహార్సల్స్ చేసిన ఫోటోలను పూజ హెగ్డే ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది.

పుష్ప
అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న భారీ చిత్రం… పుష్ప. ఈ మూవీ షూటింగ్ జులై 5న హైదరాబాద్ లో పునః ప్రారంభం అవుతుంది. ఈ సినిమాని రెండుగా విడదీశారు. మొదటి భాగాన్ని ముందుగా పూర్తి చేస్తారు.

ఆచార్య
చిరంజీవి హీరోగా కొరటాల శివ తీస్తున్న ఈ భారీ చిత్రం కూడా జులై మొదటివారంలోనే మొదలు. రామ్ చరణ్ కూడా రెండు రోజుల పాటు షూటింగ్ లో పాల్గొంటాడు. 20 రోజుల్లో సినిమాకి గుమ్మడికాయ కొట్టాలని పట్టుదలగా ఉన్నాడు కొరటాల శివ.

Advertisement

This post was last modified on June 30, 2021 1:30 pm

Advertisement
Share