Advertisement
తెలుగు న్యూస్

కలసి ఉంటే …స్టార్ మాలో

స్టార్ మా ఓ కొత్త కథతో సరికొత్త ధారావాహిక ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేసింది. అదే “కలసి ఉంటే కలదు సుఖం”. ఒంటరి కుటుంబాలు పెరుగుతున్న ఈ పరిస్థితుల్లో ఇలాంటి ఓ ఆలోచనతో సీరియల్ ప్రారంభిస్తున్న స్టార్ మా… వినూత్న కథలు అందిస్తున్న సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది.

ఇది ఆధునికంగా ఆలోచించే ఓ అమ్మ కథ. ఇది అమ్మ ఆలోచనల్ని అంచనాల్నిఅందుకోలేని పిల్లల కథ. ఎన్నో సినిమాల్లో కథానాయికగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన సీనియర్ నటి ప్రభ ఈ సీరియల్ లో ఒక కీలకమైన క్యారెక్టర్ చేస్తున్నారు. కుటుంబ పెద్దగా, పిల్లల సంతోషంలో తన సంతోషం చూసుకునే ఒక తల్లిగా ఒక విభిన్నమైన పాత్రలో ప్రేక్షకుల ముందుకురాబోతున్నారు నటి ప్రభ.

ఒక కొత్త తరహా కథ ఈ ధారావాహిక ప్రత్యేకత. 13న (సోమవారం) మధ్యాహ్నం 1 గంటకు మీ స్టార్ మా లో. మధ్య తరగతి జీవితాల్లో ఉండే అనుబంధాలు, భావోద్వేగాలతో ఈ ధారావాహిక ప్రేక్షకులను అలరించబోతోంది.

“కలసి ఉంటే కలదు సుఖం” ప్రోమో కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి…

Content Produced by: Indian Clicks, LLC

Advertisement

This post was last modified on December 13, 2021 10:48 pm

Advertisement
Share