Advertisement
తెలుగు న్యూస్

కమల్ హాసన్ బిజీ బిజీ!


కమల్ హాసన్ ఇప్పుడు కెరీర్ లో చాలా బిజీగా ఉన్నారు. అనేక సినిమాలు ఒప్పుకున్నారు. “భారతీయుడు 2” షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాకి మరో పార్ట్ కూడా తీసారట. అంటే “భారతీయుడు 3” కూడా ఉంటుంది. ఇక తాజాగా మణిరత్నం డైరెక్షన్లో “థగ్ లైఫ్” అనే సినిమా కూడా సైన్ చేశారు. ఆ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది.

ఈ సినిమాలు కాకుండా తెలుగులో ప్రభాస్ హీరోగా నటిస్తున్న “కల్కి” చిత్రంలో కూడా కమల్ హాసన్ విలన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కూడా కమల్ పూర్తి చెయ్యాలి.

తమిళంలో దర్శకుడు ఎచ్.వినోద్ చెప్పిన కథ కూడా కమల్ ఓకె చేశారు. ఆ సినిమాని కమల్ హాసన్ స్వయంగా నిర్మించనున్నారు.

తాజా సమాచారం ప్రకారం దర్శకుడు అట్లీ తన తదుపరి చిత్రంలో ఒక కీలక పాత్ర పోషించాల్సిందిగా కమల్ హాసన్ ని కోరారట. అది మల్టీస్టారర్ ప్రాజెక్ట్. సో, కమల్ హాసన్ నటుడిగా ఫుల్లు బిజీ.

Advertisement

This post was last modified on November 14, 2023 7:49 pm

Advertisement
Share