Advertisement
తెలుగు న్యూస్

ఎన్నికల బరిలో కంగన?


కంగనా రనౌత్ మన ప్రధాని నరేంద్ర మోదీకి వీరాభిమాని. అంతేకాదు, బీజేపీ కార్యకర్తలా మాట్లాడుతుంటుంది. ఇతర పార్టీల వారిని కూడా విమర్శిస్తుంటుంది. ఇప్పటికే ఆమెకి బీజేపీ ‘చెమ్చా’ అనే ట్యాగ్ తగిలించాయి ప్రతిపక్షాలు. ఇక ఇప్పుడు ఆమెని ఎన్నికల బరిలో దించాలని బీజేపీ ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

వచ్చే ఏడాది హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ బీజేపీకి వ్యతిరేక గాలులు వీస్తున్నాయి. ఇటీవల ఆ రాష్ట్రంలో జరిగిన పలు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన సత్తాని చాటింది. ఈ గడ్డు పరిస్థితులను దాటి ఆ రాష్ట్రంలో అధికారాన్ని నిలబెట్టుకోవాలంటే ఆ పార్టీకి కొంత గ్లామర్ సపోర్ట్ కావాలి. కంగన కరెక్ట్ గా సూట్ అవుతుంది.

కంగనాది సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్. ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వంతో గొడవపడి తట్టాబుట్టా సర్దుకొని సొంతూరుకి వెళ్ళింది కంగనా. కేవలం సినిమా షూటింగ్ ల కోసమే ముంబై వస్తూ పోతూ ఉంది. సో, హిమాచల్ ప్రదేశ్ లో ఆమె రాజకీయ అరంగేట్రం చేస్తే బెటర్ అనేది బీజేపీ పెద్దల లెక్క. మరి అందుకు కంగన ఒప్పుకుంటుందా అనేది చూడాలి. అంత రిస్క్ తీసుకుంటుందా? గెలిస్తే ఆమె గ్రాఫ్ పెరుగుతుంది. ఓడిపోయిందా పరువు అంతా గోవిందా!

ఆమె చేతిలో ప్రస్తుతం నాలుగు, ఐదు చిత్రాలున్నాయి. ఇటీవల ఆమె నటించిన ఏ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేదు.

Advertisement

This post was last modified on November 18, 2021 1:01 pm

Advertisement
Share