Advertisement
తెలుగు న్యూస్

కంగనాకు సరైనోడు ఇతనే

కంగనాకి గట్టిగా జవాబు ఇచ్చేందుకు బాలీవుడ్ స్టార్స్ అంతా భయపడుతున్న వేళ… ఒక యువ హీరో ఆమెని ఒక అబద్దాలకోరుగా నిలపడంలో సక్సెస్ అయ్యాడు. ఆ యువ హీరో… పంజాబ్ కి చెందిన ధిల్జిత్. బాలీవుడ్ లో కూడా “గుడ్ న్యూజ్”, “ఉడ్తా పంజాబ్” వంటి సినిమాల్లో నటించాడు ఈ పంజాబీ స్టార్.

బీజేపీ తరపున వకాల్తా పుచ్చుకొని…అందరిని సోషల్ మీడియా వేదికపై విమర్శలు గుప్పించే కంగనా లేటెస్టుగా పంజాబ్ రైతుల నిరసన దీక్షపై కూడా కామెంట్ చేసింది.

కంగనాని నిన్న ట్విట్టర్ లో ధిల్జిత్ ఓ రేంజులో ఆదుకున్నాడు. “మూథోడ్ జవాబు” అని హిందీలో అంటారే… అలా గట్టిగా సమాధానం ఇచ్చాడు. ఈ కుర్ర హీరో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ ఫెవరైట్ అయ్యాడు.

ఒక ముసలి ఆవిడ వీడియోని పోస్ట్ చేస్తూ… ఈవిడ ఇంతకుముంది ఢిల్లీ గొడవల్లో కూడా పాల్గొంది అని కంగనా కామెంట్ చేసింది. ఈమె ఇప్పుడు రైతు వేషం వేసింది అని ఎకసెక్కాలు ఆడింది. దాంతో ధిల్జిత్ కంగనా అబద్దం ఆడుతోందని, ఆమె అసలైన పంజాబీ రైతు కుటుంబానికి చెందిన ఆవిడే అని ప్రూవ్ చేసే ఒక వీడియో ఇంటర్వ్యూ ని షేర్ చేశాడు. దానికి కంగనా ధిల్జిత్ ని “నోరుమూసుకో. నువ్వు కరణ్ జోహార్ చెంచా” అన్నట్లుగా సమాధానం ఇచ్చింది.

ఇక అంతే… ధిల్జిత్ పంజాబీ భాషలో ఆమెకి గట్టిగా సమాధానం ఇచ్చాడు.

“ఇండియా నీదొక్కదానిదే కాదు. మాది కూడా. నీకు సంబంధంలేని విషయాల్లో కూడా తగుదునమ్మా అంటూ అన్నిటికి రెడీ అవుతావు. నీ అసలు రంగు మా అందరికి తెలుసు. నువ్వు 2 పోస్టులు పెడితే 36 మంది రెస్పొండ్ అవుతారేమో. నువ్వు రెండు మాటలు అంటే… మేము 36 సమాధానాలు ఇవ్వగలం…,” అంటూ వరుస ట్వీట్లతో కంగనాని వణికించాడు.

దెబ్బకి కంగనా ఇప్పుడు నేను రైతు పక్షమే అంటూ వయ్యారాలు పోతోంది. కంగనాకు సరైనోడు ధిల్జిత్ అని కామెంట్స్ పడుతున్నాయి.

Advertisement

This post was last modified on December 4, 2020 2:27 pm

Advertisement
Share