Advertisement
తెలుగు న్యూస్

కోవిడ్ నుంచి కోలుకున్న కంగన

కరోనా వైరస్ బారిన పడ్డ కంగన రనౌత్ స్పీడ్ గా కోలుకొంది. మే 9న ఆమెకి కరోనా పాజిటివ్ అని తేలింది. 10 రోజుల్లోనే ఆమెకి నెగెటివ్ వచ్చిందట. అంటే పూర్తిగా కోలుకొంది అని అర్థం. కరోనా అనేది ‘చిన్న రోగం’ అని గతంలో పేర్కొన్న కంగనా ఇప్పుడు కూడా అలాగే స్పందించింది. నేను ఇంట్లోనే ఉండి ఎలా కోలుకున్నానో రాయాలని ఉంది. కానీ అలా చేస్తే, ‘కరోనా వ్యాధి ప్రేమికుల’ మనోభావాలు దెబ్బతింటాయి అని సెటైర్ వేసింది.

“నేను దీన్ని ఎలా జయించానో రాయాలని ఉంది. కానీ కరోనా వ్యాధి ఫ్యాన్ క్లబ్స్ ని ఇబ్బంది పెట్టొద్దు అని నాకు సలహా ఇచ్చారు. అవును… కరోనా గురించి అగౌరవంగా మాట్లాడితే నొచ్చుకునే వాళ్ళు కొందరున్నారు,” అని ఇన్ స్టాగ్రామ్ లో రాసుకొంది.

కంగన అన్నట్లు కరోనా వైరస్ అనేది ‘చిన్నదే’ ఐతే ఇంతమంది జనం ఎందుకు అల్లాడుతున్నారు,ఎందుకిన్ని చావులు? కంగన వద్ద సమాధానం లేదు. ఆమె బాధ అంతా ఈ కరోనా వేవ్ వల్ల ప్రధాని మోదీ ఇమేజ్ పడిపోయిందని, అయన పరువు గంగలో కలిసిందనేదే.

Advertisement

This post was last modified on May 18, 2021 12:06 pm

Advertisement
Share