Advertisement
తెలుగు న్యూస్

నిశ్చితార్థం జరగలేదు: కత్రిన


హీరోయిన్ కత్రిన కైఫ్ కి ఎంగేజ్ మెంట్ జరిగిందని సోషల్ మిడియాలో ఈ రోజు ఉదయం ప్రచారం మొదలైంది. హీరో విక్కీ కౌశల్, కత్రిన నిశ్చితార్థం ఫోటోలు ఇవి అంటూ కొన్ని ఫోటోలు వైరల్ అయ్యాయి. దాంతో, కత్రిన టీం రంగంలోకి దిగింది. అవి ఫేక్ అని తేల్చింది.

కత్రిన, విక్కీ కౌశల్ కొంతకాలంగా డేటింగ్ చేస్తున్నారు. రణబీర్ కపూర్ హ్యాండిచ్చిన తర్వాత విక్కీ కౌశల్ తో డేటింగ్ మొదలుపెట్టింది కత్రిన. త్వరలోనే వీరి పెళ్లి అంటూ మూడు నెలలుగా వార్తలు హల్చల్  చేస్తున్నాయి. ఈ క్రమంలోనే వీరి ఎంగేజ్ మెంట్ జరిగిందని వార్తలు, ఫోటోలు బయటికి వచ్చాయి.

ఐతే, కత్రిన టీం ఇదంతా ఫేక్ అని కొట్టిపారేసింది. నిశ్చితార్థం జరగలేదని కత్రిన టీం స్పష్టం చేసింది.

విక్కీ కౌశల్ ఇటీవల రాజి, యూరి వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించాడు. అతనికి 33 ఏళ్ళు. కత్రినకి 38 ఏళ్ళు. ఆమె కన్నా అతను  5 ఏళ్ళు చిన్నవాడు.

Advertisement

This post was last modified on August 18, 2021 5:46 pm

Advertisement
Share