ఎప్పుడో ఆగిన మూవీ, ఇంకా ఆగని రగడ

ఓ సినిమాకు వర్కింగ్ టైటిల్ ఉంటుంది. తర్వాత అసలు టైటిల్ ప్రకటిస్తారు. ఆల్రెడీ టైటిల్ ప్రకటించి, దాని స్థానంలో కొత్తగా మరో పేరు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ కీర్తిసురేష్ నటిస్తున్న ఓ సినిమాకు మాత్రం ముచ్చటగా మూడోసారి టైటిల్ మారుస్తున్నారు.

కీర్తి సురేష్ హీరోయిన్ గా అడుగుపెట్టిన తొలినాళ్లలో ఒక సినిమా మొదలైంది. కీర్తిసురేష్ హీరోయిన్ గా, నవీన్ విజయకృష్ణ హీరోగా ఓ సినిమా షూటింగ్ మొదలై ఆగిపోయింది. దానికి “జానకితో నేను” అనే టైటిల్ పెట్టారు అప్పుడు. ఆ తర్వాత కొన్ని రోజులకు “అయినా ఇష్టం నువ్వు” అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇప్పుడు తాజాగా దీనికి “రెండు జళ్ల సీత” అనే టైటిల్ అనుకుంటున్నారు. కీర్తి సురేష్ కి ఇప్పుడు ఉన్న క్రేజ్ ని యూజ్ చేసుకునేందుకు ఈ “పాత” సినిమాని రిలీజ్ చేసే ప్రయత్నాలు షురూ అయ్యాయి.

నిజానికి ఈ సినిమాపై కాపీరైట్ ఇష్యూ నడుస్తోంది.

చంటి అడ్డాల ఈ సినిమాకు నిర్మాత. ఆయన ఈ సినిమా హక్కుల్ని తనకు అమ్మేశారని మరో నిర్మాత నట్టికుమార్ వాదిస్తున్నారు. తన దగ్గర బాండ్ పేపర్ సాక్ష్యాలు కూడా ఉన్నాయంటున్నారు. అటు చంటి మాత్రం ఈ సినిమాను ఎవ్వరికీ అమ్మలేదంటున్నారు. వీళ్లిద్దరూ కలిసి ఈ సినిమా టైటిల్స్ ను ఎడాపెడా మార్చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పంచాయితీ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది.

TeluguCinema

TeluguCinema

  • News

Actress Kayadu Lohar announces break from social media

Actress Kayadu Lohar has announced that she is taking a break from social media. The…

21 minutes
  • News

Ram Charan and Upasana finally reveal daughter Klin Kaara’s face

Ram Charan and his wife Upasana have finally given fans a clear glimpse of their…

1 hour
  • News

Samantha pregnant with first child; baby bump goes viral

It is celebration time for Samantha. Her latest film, "Maa Inti Bangaaram," is performing well…

2 hours
  • Box Office

Day 1: Maa Inti Bangaram posts massive numbers worldwide

Samantha has once again proved her box-office pull. Returning to the big screen in a…

7 hours
  • Movie Reviews

Deewana Review: A love story powered by a different twist

What’s Deewana about? Munna (Harshith Reddy), the son of a lower middle-class family in Hyderabad,…

8 hours
  • News

Raghav Juyal’s Vikram Maalik avatar revealed in ‘The Paradise’

The makers of “The Paradise” have unveiled a special glimpse introducing Bollywood actor Raghav Juyal’s…

24 hours