Advertisement
తెలుగు న్యూస్

కాబోయే భర్త… అంబానీ+హృతిక్!

కియారా అద్వానీ దృష్టిలో మగాడు అంటే ఎలా ఉండాలి అంటే… అబ్బో ఆ లిస్ట్ వింటే … కళ్ళు తిరుగుతాయి. అమ్మడి అభిలాష మామూలుగా లేదు. నేహా ధూపియా చాట్ షోలో ఆమె తనకు కాబోయే భర్తలో ఏ లక్షణాలు కోరుకుంటుందో చెప్పింది.

“జెన్నిఫర్ లారెన్స్ లా సెన్సాఫ్ హ్యూమర్ ఉండాలి. హృతిక్ లా అందం, అంబానీలా ఇన్కమ్. ఫర్హాన్ అక్తర్, ఆయుష్మాన్ ఖురానాలా టాలెంట్ ఉంటే బెస్ట్.
అక్షయ్ కుమార్ కున్న డిసిప్లిన్, స్టేమినా కలిగి ఉండాలి,” ఇలా తన చిట్టా బయట పెట్టింది.

ఆమె లిస్ట్ అయితే పెద్దగానే ఉంది… కానీ నిజ జీవితంలో అలా జరుగుతుందా అనేది చూడాలి. చాలా మంది హీరోయిన్లు చివరికి అంత అందంగా లేని వారితోనే సెటిల్ అవుతారు. మరి కియారా కోరుకున్న క్వాలిటీస్ ఉన్నవాడు వస్తాడా?

Advertisement

This post was last modified on October 21, 2020 9:21 am

Advertisement
Share