Advertisement
తెలుగు న్యూస్

బజ్జీల బుజ్జికి ‘పబ్’లిసిటీ

పబ్ కి ఎందుకు వెళ్తారు?
పార్టీ చేసుకోవడానికో, డ్యాన్స్ చేయడానికో, తాగడానికో, ఫ్రెండ్స్ తో సరదాగా గడపడానికో కదా!
కానీ, బజ్జీలు తినడానికి ఎవరైనా పబ్ కి వెళ్తారా?
అవును నేను బజ్జిలు తినేందుకే వెళ్ళానని సమాధానం ఇచ్చి ఒక అందాల భామ పాపులర్ అయింది. ఆ భామ పేరు…ఖుషిత. పూర్తి పేరు… ఖుషిత కళ్లపు.

ఈమె ఎవరు అని అనుకుంటున్నారా? మీలాగే మేం కూడా మొన్న ఆదివారం వరకు ఆమె పేరు వినలేదు, ఆమె ఫోటో చూడలేదు. కానీ, ఈ భామ వర్ధమాన నటి అంట. అలాగే మోడల్ కూడా. ఇన్ స్టాగ్రామ్ లో ఇప్పటికే 4 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. అంటే, కుర్రకారు ఆమెకి బాగా కనెక్ట్ అయ్యారన్నమాట. ఆమె అందచందాలు అలాగే ఉన్నాయిలెండి.

ఇంతకీ ఈ ఇంట్రడక్షన్ ఎందుకంటే… మొన్న జరిగిన హైదరాబాద్ పబ్ రైడ్ ఉదంతంలో నిహారిక, రాహుల్ సిప్లిగంజ్ పేర్లతో పాటు ఈ వర్ధమాన నటి పేరు మారుమోగింది. అర్ధరాత్రి 2 గంటలకు ఆమె ఆ పబ్ లో ఫ్రెండ్స్ తో ఉంది. కానీ, తన పేరుని, తన ఫేస్ ని మీడియా హైలెట్ చెయ్యడంతో కస్సుమని లేచింది. తన పరువు తీయొద్దు అని వేడుకుంటూ మీడియాకి బోలెడన్ని ఇంటర్వ్యూలు ఇచ్చింది. అసలు తాను ఆ పబ్ కి ఎందుకు వెళ్లానో చెప్పింది. ఆమె చెప్పిన సమాధానం తెలిస్తే అందరూ నవ్వాల్సిందే.

ఆ పబ్ లో “ఛీజ్ బజ్జీలు” బాగుంటాయట. అవి తినేందుకు వెళ్లిందట.

అర్ధరాత్రి పూట “ఛీజ్ బజ్జీల” కోసం పబ్ కి వెళ్లడం అనే మేటర్ బాగా వైరల్ అయింది. ఆ విధంగా ఖుషిత సోషల్ మీడియాలో పాపులర్ అయింది.

Advertisement

This post was last modified on April 7, 2022 1:33 pm

Advertisement
Share