Advertisement
తెలుగు న్యూస్

లాస్య.. మరో ‘బిగ్’ బాంబ్

బిగ్ బాస్ హౌజ్ లో వరుసగా షాకులిస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది లాస్య మాత్రమే. హౌజ్ లో అడుగుపెట్టిన రోజు నుంచి తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఒక్కో సీక్రెట్ బయటపెడుతూ జనాలకు షాకుల మీద షాకులు ఇస్తూనే ఉంది ఈ యాంకర్.

తాజాగా లాస్య మరో బాంబ్ పేల్చింది. తన ప్రేమ-పెళ్లికి సంబంధించి ఇంకో సీక్రెట్ బయటపెట్టింది. Bigg Boss Telugu 4 – Episode 68 లో రాత్రి బిగ్ బాస్ హౌజ్ లో ఓ ఇంట్రెస్టింగ్ టాస్క్ జరిగింది.

అదేంటంటే.. ఇప్పటివరకు ఎవ్వరికీ చెప్పని ఓ సీక్రెట్ ను హౌజ్ మేట్స్ అంతా బయటపెట్టాలి. ఆ సీక్రెట్ ఎలా ఉండాలంటే.. తమ ఆప్తులకు కూడా అది తెలిసి ఉండకూడదు. ఈ టాస్క్ లో భాగంగా లాస్య చెప్పిన మేటర్ విని అంతా అవాక్కయ్యారు.

లాస్య ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి ఆమె కంటే చిన్నోడంట. ఈ విషయాన్ని లాస్య స్వయంగా బయటపెట్టింది. ఆ విషయం తనకు కూడా తెలియదని, ప్రేమించిన తర్వాత చాన్నాళ్లకు తనకు తెలిసిందంటున్న లాస్య.. తన లవర్ తనకంటే ఏడాది చిన్న అని తెలిస్తే అస్సలు ఇంట్లో ఒప్పుకోరని ఎవ్వరికీ చెప్పలేదంటోంది. బిగ్ బాస్ హౌజ్ వేదికగా ఈ సీక్రెట్ ను బయటపెట్టిన లాస్య.. ఈ సందర్భంగా తన తల్లిదండ్రులకు సారీ చెప్పింది.

అంతేకాదు.. అంతా అనుకుంటున్నట్టు తన భర్త సౌండ్ పార్టీ కాదంటోంది. మహారాష్ట్రకు చెందిన తన భర్త మధ్యతరగతి కంటే దిగువస్థాయి వ్యక్తి అని, ఆ విషయం కూడా చాలామందికి తెలియదని చెప్పుకొచ్చింది.

ఇలా మినిమం గ్యాప్స్ లో సంచలన విషయాలు బయటపెడుతున్న లాస్య, సీజన్-4 పూర్తయ్యేలోపు ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Advertisement

This post was last modified on November 13, 2020 11:53 am

Advertisement
Share