Advertisement
తెలుగు న్యూస్

లాస్య మాట నిజమవుతుందా?

బిగ్ బాస్ సీజన్-4 విన్నర్ ఎవరనే అంశంపై ఇప్పటికే చాలా చర్చ నడుస్తోంది. మరో పాతిక రోజుల్లో ఈ సీజన్ ఎండ్ ఎవుతుంది. మరో ఇద్దరు ఎలిమినేట్ ఐతే చాలు.. విన్నర్ ఎవరనే అంశంపై చాలామందికి దాదాపు క్లారిటీ వచ్చేస్తుంది.

విన్నర్ గా నిలిచే ఫేవరైట్ వారిలో ముగ్గురు నలుగురు కంటెస్టెంట్లు ఉన్నప్పటికీ.. ఎక్కువమంది అభిజీత్ కే ఓటేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఎలిమినేట్ అయిన లాస్య కూడా అభిజీత్ విన్నర్ అనే విషయాన్ని పరోక్షంగా చెప్పేసింది.

మొదట్నుంచి అభిజిత్ పై ప్రత్యేకమైన అభిమానాన్ని చూపిస్తూ వస్తోంది లాస్య. ఎలిమినేట్ అయిన తర్వాత ఆ అభిమానాన్ని ఒక్కసారిగా బయటపెట్టింది. తనకు ఎంతో ఇష్టమైన వ్యక్తి అభి అని, హౌజ్ లో అందర్నీ సమానంగా చూస్తాడని మెచ్చుకుంది.

నామినేషన్ రౌండ్స్ లో అభిపై ఫిర్యాదులు చేసే హౌజ్ మేట్స్ ఉండొచ్చు కానీ, మనసులో మాత్రం ప్రతి ఒక్కరికి అభి అంటే ఇష్టం ఉందని చెప్పుకొచ్చింది. అభి టాప్ లో ఉండే చూడాలని ఉందంటూ పరోక్షంగా వెల్లడించింది.

Advertisement

This post was last modified on November 23, 2020 2:30 pm

Advertisement
Share