చాలాసార్లు నెట్ లో ఛాటింగ్ చేసింది కానీ లావణ్యకు ఎప్పుడూ ఇలాంటి ప్రశ్నలు ఎదురవ్వలేదు. ఈసారి మాత్రం ఆమెకు ఎక్కువగా ప్రేమ-పెళ్లి-నిశ్చితార్థం లాంటి ప్రశ్నలే ఎదురయ్యాయి. వాటితో పాటు మరిన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ కు ‘లావణ్యం’గా ఇచ్చిన సమాధానాలు చూద్దాం.
ఆత్రుత, ఓవర్ థింకింగ్ ను ఎలా అధిగమిస్తారు? ఆత్రుత, గాబరా మొదలైనప్పుడు భవిష్యత్తులో చేయాల్సిన పనుల గురించి ఆలోచిస్తా. లేదంటే నా స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేస్తాను. పనికిరాని విషయాలపై టైమ్ వేస్ట్ చేయడం ఎందుకు?
రోజూ డైరీ రాస్తారా? నిజంగా రాయాలనుకుంటాను.. కానీ రాయలేను
ఐపీఎల్ గురించి? సన్ రైజర్స్ ను నేను సపోర్ట్ చేస్తాను. రాజస్థాన్ రాయల్స్ కూడా ఇష్టం.
వేలికి ఉంగరం ఉంది.. పెళ్లి ఎప్పుడు? వేలికి ఉంగరం ఉంటే అదే అర్థమా? అమ్మాయిల వేళ్లకు ఉంగరాలు ఉండకూడదా? నా బర్త్ డేకు నేను కొనుక్కున్న ఉంగరం అది.
ఇంతకీ పెళ్లి ఎప్పుడు? మా అమ్మానాన్నకు కూడా లేని తొందర మీకు ఎందుకు?
ట్రెండ్స్ అంటే ఇష్టమా? అవును.. నాకు ట్రెండ్స్ అంటే ఇష్టమే. ఫాలో అవుతుంటా కూడా.
చావు కబురు చల్లగా, ఎ-1 ఎక్స్ ప్రెస్ సినిమాల్లో ఏదిష్టం. రెండూ ఇష్టమే.. రెండు సినిమాలపై చాలా ఎక్సయిటింగ్ గా ఉన్నాను.
ఇష్టమైన ఫుడ్, డ్రింక్ అన్నం-పప్పు-చట్నీ అంటే చాలా ఇష్టం. ఇక డ్రింక్స్ లో టీ అంటే ఇష్టం. కానీ పాలు తక్కువగా ఉండాలి.
ఏ ఊరిలో ఎక్కువగా ఉంటారు? హైదరాబాద్, డెహ్రాడూన్, ముంబయి. ఈ మూడు నగరాలూ ఇష్టం.
Advertisement
This post was last modified on October 18, 2020 1:18 pm