Advertisement
తెలుగు న్యూస్

లండన్లో లూసిఫర్ పాటల సెటప్!


మెగాస్టార్ చిరంజీవి నటించనున్న ‘లూసిఫర్’ రీమేక్ సినిమా కోసం పాటలు రెడీ అవుతున్నాయి. ఈ సినిమాలో కీలకమైన ఒక పాటని లండన్ లోనే ఆబ్బె అనే స్టూడియోలో రికార్డ్ చేయన్నారు సంగీత దర్శకుడు తమన్.

తమన్ ఐడియాలకు దర్శకుడు మోహన్ రాజా పడిపోయినట్లు కనిపిస్తోంది. తమన్ అద్భుతంగా వర్క్ చేస్తున్నాడంటూ మోహన్ రాజా కితాబు ఇచ్చారు.

చిరంజీవి హీరోగా నటించే ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్టైన ‘లూసిఫర్’ సినిమాకి రీమేక్. ఇందులో చిరంజీవిది కింగ్ మేకర్ పాత్ర. ‘కింగ్ మేకర్’ అనే పేరునే తెలుగులో పరిశీలిస్తున్నారట. ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఇంకా హీరోయిన్ల ఎంపిక పూర్తి కాలేదు. ఇంతకుముందు నయనతారని తీసుకోవాలని అనుకున్నారు. కానీ, ఆమె ఆ తర్వాత తప్పుకొంది.

‘లూసిఫర్’లో మరో ఇద్దరు హీరోలు కూడా నటించాలి. ఇద్దరు యువ హీరోలతో చర్చలు సాగుతున్నాయి.

Advertisement

This post was last modified on July 26, 2021 9:47 pm

Advertisement
Share