తెలుగు న్యూస్

‘మహానటి’ మేకర్స్ కి సత్కారం

వచ్చే డిసెంబర్ 6న మహానటి సావిత్రి 90వ జయంతి. ఈ సందర్భంగా ఆమె కూతురు విజయచాముండేశ్వరి తమ తల్లి పేరిట సావిత్రి మహోత్సవ్ నిర్వహిస్తున్నారు.

ఈ తరానికి సావిత్రి జీవిత విశేషాలు, ఆమె గొప్పతనం నాగ్ అశ్విన్ తీసిన “మహానటి” సినిమా ద్వారా ఎక్కువగా తెలిసింది. అందుకే ఆ టీంకి సావిత్రి 90వ జయంతి సందర్భంగా ప్రత్యేక సన్మానం చెయ్యనున్నారు.

“మా మాతృమూర్తీ, మహానటీ అయిన శ్రీమతి సావిత్రి గారి 90వ జయంతి వేడుకలను హైదరాబాద్ రవీంద్రభారతిలో డిసెంబర్ 1 నుంచి 6 వరకు ‘సావిత్రి మహోత్సవ్’ పేరిట నిర్వహిస్తున్నాం. ప్రముఖ కళా సంస్థ “ సంగమం” ఫౌండేషన్ తో కలిసి నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో డిసెంబర్ 1 నుంచి 5 వరకు సావిత్రి గారి సినిమాల ప్రదర్శన, పాటల పోటీలు ఉంటాయి. డిసెంబర్ 6న జరిగే సావిత్రి 90 వ జయంతి సభలో ‘మహానటి’ చిత్ర దర్శక నిర్మాతలైన నాగ్ అశ్విన్, ప్రియాంకాదత్, స్వప్నాదత్ లనూ, ‘సావిత్రి క్లాసిక్స్’ పుస్తక రచయిత సంజయ్ కిషోర్, ప్రచురణకర్త బొల్లినేని కృష్ణయ్య లనూ ప్రత్యేకంగా సత్కరిస్తున్నాము. మండలి బుద్ధప్రసాద్ గారి అధ్యక్షతన జరిగే ఈ సభకి భారత పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా, చలన చిత్ర ప్రముఖులు ఆత్మీయ అతిథులుగా విచ్చేయనున్నారు,” అని ఒక ప్రకటనలో విజయచాముండేశ్వరి తెలిపారు.

1934లో జన్మించిన సావిత్రి 1981లో 47 ఏళ్ల వయసులో కన్నుమూశారు.

TeluguCinema

TeluguCinema

  • News

‘Chennai Love Story’ receives UA certificate, buzz is impressive

Kiran Abbavaram's upcoming romantic drama “Chennai Love Story” has completed its censor formalities, with the…

6 hours
  • News

Ravi Teja begins dubbing for Shiva Nirvana’s Irumudi

Ravi Teja has started dubbing for his upcoming emotional family drama “Irumudi,” directed by Shiva…

6 hours
  • News

‘Raave Cheliya’ from Srinivasa Mangapuram released

The makers of “Srinivasa Mangapuram” have unveiled "Raave Cheliya” song from the film ahead of…

6 hours
  • News

Prabhas and Yash set a new release trend among top South stars

Prabhas and Yash have emerged as the only leading South Indian stars to release two…

7 hours
  • News

‘Raasa Gummadi’ from Korean Kanakaraju: The song is filled with folk beats

Varun Tej's upcoming horror-comedy “Korean Kanakaraju” is gearing up for its theatrical release on August…

7 hours
  • News

ZEE5 officially confirms NBK111 and Vrushakarma acquisitions

ZEE5 has officially announced the acquisition of the digital streaming rights for Nandamuri Balakrishna's upcoming…

7 hours