Advertisement
తెలుగు న్యూస్

‘నాన్న ఇచ్చిన గిఫ్ట్ అదే’

సూపర్ స్టార్ కృష్ణ ఇటీవలే కన్ను మూసిన విషయం తెలిసిందే. ఆదివారం ఆయన పెద్ద కర్మ జరిగింది. హైదరాబాద్ లో నిర్వహించిన ఈ పెద్దకర్మకు భారీ ఎత్తున అభిమానులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు.

“నాన్న గారు నాకు చాలా ఇచ్చారు. నాన్న గారు ఇచ్చిన దాంట్లో అన్నిటికంటే గొప్పది మీ అభిమానం. ఆయనకి ఎప్పుడూ రుణపడి వుంటాను. నాన్న గారు ఎల్లప్పుడూ నా గుండెల్లో వుంటారు. మీ గుండెల్లో వుంటారు. మన మధ్యే ఉంటారు. మీరందరూ ఇక్కడకు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. మీ అభిమానం, ఆశీస్సులు నాపై ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను,” అన్నారు మహేష్ బాబు.

మరోవైపు, మహేష్ బాబు తన కొత్త సినిమా షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభించే అవకాశం ఉంది.

Advertisement

This post was last modified on November 27, 2022 8:19 pm

Advertisement
Share