Advertisement
తెలుగు న్యూస్

స్పెయిన్ నుంచి వచ్చిన మహేష్


సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల దుబాయ్ వెళ్లారు. ఆయన భార్య, కూతురు, కొడుకు గత వారమే హైదరాబాద్ కి తిరిగి వచ్చారు. కానీ, మహేష్ బాబు అక్కడి నుంచి స్పెయిన్ వెళ్లారు.

కొంతకాలంగా ఆయన మోకాళ్ళ నొప్పితో బాధపడుతున్నవిషయం తెలిసిందే. రెండేళ్ల క్రితం స్పెయిన్ లోనే ఒక పేరొందిన ఆర్థో డాక్టర్ వద్ద చికిత్స పొందారు. సర్జరీ కూడా జరిగింది. దానికి సంబందించిన పోస్ట్ ట్రీట్ మెంట్ లో భాగంగా అదే డాక్టర్ దగ్గరికి వెళ్లారు. ట్రీట్మెంట్ పూర్తి కావడంతో ఆయన తిరిగి హైదరాబాద్ వచ్చారు.

ఇక మహేష్ బాబు తన సినిమాల షూటింగ్ పై ఫోకస్ పెడుతారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా షూటింగ్ వచ్చే నెల 5 తేదీన ప్రారంభం అవుతుంది. నాలుగు నెలలలో షూటింగ్ మొత్తం పూర్తి చెయ్యాలని టార్గెట్ పెట్టుకున్నారు.

ఆ తర్వాత రాజమౌళి సినిమా వర్క్ మొదలుపెడుతారు.

Advertisement

This post was last modified on May 17, 2023 1:15 pm

Advertisement
Share