Advertisement
తెలుగు న్యూస్

ఇప్పట్లో రెండో పెళ్లి లేదు!

కరోనా సెకండ్ వేవ్ వల్ల మలైక రెండో పెళ్లి ఆగింది. 35 ఏళ్ల యువ నటుడు అర్జున్ కపూర్ తో 47 ఏళ్ల మలైకా అరోరా చాలా కాలంగా సహా జీవనం చేస్తోంది. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలని రెండేళ్లుగా అనుకుంటున్నారు. గతేడాది లాక్డౌన్ కారణంగా రద్దు అయింది.

ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ వచ్చి వారి ఆశలపై నీళ్లు చల్లింది. ఇప్పట్లో మలైక రెండో పెళ్లి ఉండకపోవచ్చు. ఐతే, ఇద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు. మలైక కూడా తన మొదటి భర్త నుంచి విడాకులు పొందింది.

మలైక ఇప్పుడు సినిమాల్లో నటించడం కూడా తగ్గించింది. ఇంకా చెప్పాలంటే.. ఆమెకి అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ కి విడాకులు ఇవ్వగానే… బాలీవుడ్ ఫిలింమేకర్స్ ఆమెకి ఆఫర్లు తగ్గించారట. అటు అర్జున్ కపూర్ లో గ్రోత్ లేదు. అతని సినిమాలు ఏవీ ఆడడం లేదు.

Advertisement

This post was last modified on May 6, 2021 10:10 am

Advertisement
Share