Advertisement
తెలుగు న్యూస్

నరేష్ సరసన మళ్ళీ ‘జైలర్’ భామ

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ… జైలర్. ఆ సినిమాలో రజినీకాంత్ కోడలుగా నటించింది మిర్నా. అలా ఒక్కసారిగా పాపులర్ అయింది మిర్నా మీనన్. ఐతే అంతకుముందే ఆమె తెలుగులో రెండు చిత్రాల్లో నటించింది. అందులో ఒకటి “ఉగ్రం” అనే సినిమా. అల్లరి నరేష్ హీరోగా నటించాడు అందులో.

మళ్ళీ ఇప్పుడు ఇంకో చిత్రంలో ఈ జైలర్ భామ నరేష్ సరసన నటించింది.

“నా సామిరంగ” అనే సినిమాలో నాగార్జున హీరో. అల్లరి నరేష్ ఒక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాలో మిర్నా నరేష్ కి జోడిగా నటిస్తోంది. మంగ పాత్రలో మిర్నా మీనన్ ను పరిచయం చేస్తూ “నా సామి రంగా” టీం ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేసింది. ఈ ఫోటోలో మిర్నా మీనన్ సంప్రదాయం ఉట్టిపడే చీరకట్టులో కనిపించింది.

“నా సామి రంగ”లో నాగార్జున సరసన ఆషిక రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తోంది. రాజ్ తరుణ్ కి రుక్సార్ ధిల్లాన్, నరేష్ కి మిర్నామీనన్ జోడిగా నటిస్తున్నారు.

Advertisement

This post was last modified on January 4, 2024 6:10 pm

Advertisement
Share