Advertisement
తెలుగు న్యూస్

ఓటిటికే సూపర్ స్టార్ ఓటు!


మలయాళ చిత్రసీమలో తిరుగులేని నంబర్ వన్ హీరో… మోహన్ లాల్. ఈ మధ్యకాలంలో ఈ సీనియర్ హీరో ఇచ్చినన్ని బ్లాక్ బస్టర్లు మరో మలయాళం హీరో ఇవ్వలేదు. “దృశ్యం”, “పులిమురుగన్”, “లూసిఫర్”… వంటివి థియేటర్లలో విడుదలై సంచలన విజయాలు సాధించాయి. “దృశ్యం” అన్ని భాషల్లో రీమేక్ అయింది. “లూసిఫర్” చిత్రాన్ని ఇప్పుడు చిరంజీవి హీరోగా “గాడ్ ఫాదర్” పేరుతో తెలుగులో రీమేక్ అవుతోంది.

ఇలాంటి పొజిషన్ లో ఉన్నా కూడా మోహన్ లాల్ ఈ కరోనా టైంలో ఓటిటికే ఓటు వేస్తున్నారు. “దృశ్యం 2″ సినిమాని డైరెక్ట్ గా అమెజాన్ లో విడుదల చేశారు. ఇప్పుడు ” బ్రో డాడీ” పేరుతో రూపొందుతున్న సినిమా కూడా థియేటర్లలో కాకుండా ఓటిటి వేదికపైనే రిలీజ్ కానుంది. మోహన్ లాల్, మీనా జంటగా మరో మలయాళ పెద్ద హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్ట్ చేసిన మూవీ ఇది.

రిపబ్లిక్ డే స్పెషల్ గా జనవరి 26న డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమ్ కానుంది. ఇది చాలా పెద్ద సినిమా. అయినా, థియేటర్లలో విడుదల చెయ్యకుండా ఓటిటికే ఇచ్చేశారు మోహన్ లాల్.

ఇప్పుడు కరోనా టైంలో సినిమాలని ఏళ్ల తరబడి వాయిదా వెయ్యడం కరెక్ట్ కాదనేది మోహన్ లాల్ భావన. అందుకే, ఆయన తన సినిమాలు థియేటర్లో విడుదల కావడం లేదని బాధపడడం లేదు.

Advertisement

This post was last modified on January 15, 2022 10:32 pm

Advertisement
Share