Advertisement
తెలుగు న్యూస్

షూటింగ్‌ షురూ చేసిన MS రాజు

ఒకప్పుడు భారీ బ్లాక్ బస్టర్స్ కి మారుపేరు నిర్మాత ఎంఎస్ రాజు. గతేడాది దర్శకుడిగా “డర్టీ హరి”తో యూత్ ఫుల్ సినిమాల దారిలోకి వచ్చారు ఎమ్మెస్ రాజు. ఓటిటీ జెనెరేషన్ అభిరుచిని అందిపుచ్చుకునే ప్రయత్నంలో సక్సెస్ అయ్యారు. ఇప్పుడు అదే పంథాలో “7 డేస్ 6 నైట్స్” పేరుతో మరో మూవీ డైరెక్ట్ చేస్తున్నారు.

ఈ చిత్రానికి సుమంత్ అశ్విన్, రజనీకాంత్ ఎస్ నిర్మాతలు. ఐతే, ఈ సినిమాలో హీరో, హీరోయిన్ల పేర్లని ఆయన వెల్లడించడం లేదు. ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ చేశారు.

“డర్టీహరితో నా జీవితం కొత్త మలుపు తీసుకుంది. ‘డర్టీ హరి’ ఓ జానర్ సినిమా.‌ ‘7 డేస్ 6 నైట్స్’ కూల్ అండ్ న్యూఏజ్ ఎంటర్టైనర్. ఇందులో నటీనటుల వివరాల్ని ప్రస్తుతానికి గోప్యంగా ఉంచాం. తర్వాత వాళ్లు ఎవరనేది వెల్లడిస్తాం. కథ పరంగా వివిధ ప్రాంతాల్లో చిత్రీకరణ చేయాలి. అందుకు తగ్గట్టు పక్కా ప్రణాళిక వేసుకుని, చిత్రీకరణ మొదలుపెట్టా,”మన్నారు ఎమ్మెస్ రాజు.

Advertisement

This post was last modified on June 27, 2021 6:29 pm

Advertisement
Share